పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

159

ఎనిమిదవ అధ్యాయము


దేశీయమహాసభ
వారి దివాళాస్థితి.

1779-80 చలికాలము జాషింగ్టను క్రిందనున్న అమెరికను సేనలకు మిగుల బాధకరముగ నుండెను. చలికాలము శీఘ్రముగ పొరంభించెను. చలి మిక్కుటముగ నుండెను. అమెరికసులు ఆంతయు తమ మిత్రులగు పరాసువారు చేసి పెట్టెదరని భారమం తయు నా మీద త్రోయుచుండిరి. స్వయం సహాయము తక్కువయ్యెను. “ఆమెకనులకోమనమును స్పెయి" వారుసు చేరిన తరువాత అమెరికనుల ప్రయత్నములు క్షీణించినవి. సోమరితనముతోడను ఆశ్రద్దతోడను కూడుకొనినారు. " అని 1779వ సంవత్సరం సెప్టెంబరు నెలలోనే అమెరికాలోని పరాను రాయబారి పరాసు ప్రభుత్వమునకు వ్రాసిను. అమెరికా విప్లవ ప్రభుత్వము ( దేశీయ మహాజనసభ), దివాళయగు స్థితిలో నుండెను. ఇరవై కోట్ల డాలరుల కాగితములను సృష్టించినారు. ఈ కాగితపు డాలరులను పుచ్చుకొనువారు అరుదుగ నుండిరి. ఆరువందల కాగితపు డాలర్లకు గాని యొక పాదరక్షలజత దొరక కుండెను. వాషింగ్టనువద్ద ద్రవ్యము లేక కాగితపు ముక్కలను పుచ్చుకొనువారు లేక సైనికు లందరును చలికాలమున దుస్తులును తిండియు లేక చాల బాధ పడి, చాలకాలము స్వల్పమగు భోజనములోనే తృపినొందు చుండిరి. కొంతకాల మదియును కూడ లేకుండెను. వివిధ రాష్ట్రములవారును సైనికులకు భోజనపదార్థములను సమకూర్చ వలెనని దేశీయ మహాజనసభవారుత్తరువు చేసిరిగాని దాని ప్రకారము జరుపువారు లేరైరి. సైనికులే చుట్టునున్న ప్రజల నుండి బలవంతముగ భోజన పదార్ధములను దోచుకొని తెచ్చు