పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

160

అమెరికా సంయుక్త రాష్ట్రములు


"నుచుండిరి. నిర్నయమైన యొక దినమువరకు మంచి యేర్పాట్లను చేయనిచో తామందరము వెళ్ళిపోయెదమని సైనికోద్యోగులందరుసు కట్టుకట్టి వాషింగ్టనుకు దెలియ చేసిరి. 1780 సంవత్సరం ఏప్రిలు 3 వ తేదీన " యింత తీవ్రముగ నసంతృప్తి పబలి న సమయము యుద్ధకాలములో ఎప్పుడును తటస్థించ లేద"ని వాషింగ్టను వ్రాసెను. సైన్యములకు అయిదు నెలల జీతము బాకీయున్నదనియు, యెప్పుడును ఆరు దినములకన్న యెక్కువ రోజులకు చాలిన ఆహార పదార్థములు సైన్యముల వద్ద లేపనీయు, ఆనేక సమయములలో భోజనము లేకుండ. కూడ నుండుచు వచ్చిరనియు సైన్యములవద్ద దవ్యము బొత్తిగా లేదనియు, వీరికి ఋణమునిచ్చువారు లేరనియు, సైని కులయొక్క సహనశక్తి అత్యద్భుతముగ చూపబము చున్న దనియు, దేశీయ మహాసభ సంఘమువారు తెలియబరచిరి.. కనెక్టికటు సేనలలో తిరుగబాటు సిద్ధమయ్మెను గాని వాషింగ్ట నెటులనో నణచి వేసెను. ఆరునెలలవరకు నూరు రొఖ్డాలర్లు ముందుగ చేతిలో పెట్టినగాని యొక్క అమెరిక నై సను సై స్యములలో, చేరకుండెను. జూన్ నెలలో వాషింగ్ట ను వద్ద పోరునలుపుటకు తగిన స్థితిలో నున్న సైనికుల మొత్తము మూడు వేల ఏడువందల అరవై మంది మాత్రముడిరి.

అమెరికనుల
నిస్సహాయత.

ఫ్రాన్సునుండి తగిన సహాయము తీసుకొనిరమ్మని లఫయతు ప్రభువుకు పరాసు దేశమునకు బంపిరి, ఆయన చేయదగిన ప్రయత్న మంతయు చేసిఏప్రిలు నెలలో నమెరికాకు తిరిగివచ్చెను. కొలదికాలములో వరాసు సైన్యము లమెరికాకు వచ్చి చేరునని