పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

158

అమెరికా సంయుక్త రాష్ట్రములు


పక్షమున ఎనిమిది వందలమంది చనిపోయిరి. ఆంగ్లేయులకు బహుకొద్ది నష్టము కలిగెను. పరాసు సేనాని యుద్ధము చాలించి యోడ సైన్యముతోడను మెట్ట సైనికులతోడను వెడలి పోయెను. లింకను సేనాని మిగిలిన సైన్యములతో ఛార్లెను టనుకు పోయెను.

అమెరికను సేనాని
ఆంగ్లేయులకు
లోబడుట.

యుద్ధము బాగుగా జరుపుటకై రోడు అయిలండు లోనున్న ఆంగ్లేయ సేనలన్నియు న్యూయార్కు వద్ద క్లిన్న్ట సేనాని క్రిందనున్న సైన్యము లతో చేరెను. ఇంగ్లాండు నుండి కొన్ని కొత్తసేసలు వచ్చి వీటితో కలసెను. ఈ సైన్య ములన్నియు డిశంబకు 28వ తేదీన న్యూమూర్కు నుండి బములు దేరి , తోవలో చలిబాధపలనను నౌకల లోపమువల వలనను శ త్రు ప్రజల అడ్డంక మువలనను కొంత నష్టమును పొందుచు 1780 వ సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీన ఛార్లెస్టన్ పట్టణమును చేరెను. దానిని ముట్టడించెను. లింకను సేనాని అమెరికను సై స్యములనన్నిటితోడను నా పట్టణములో నుండెను. గాని ఆంగ్లేయుల నెదిరింప జాలకపోయెను. ఆపట్టణములోని ప్రజలందరును రాజభక్తులై అమెరికనులకు సహాయ మేమియు చేయరైరి. పట్టణమును సంరక్షించుటకు తగిన బలము లేదు.గావున మే నెల 12వ తేదీన అమెరికను సేనాని లింకను అంగ్లేయులకు లోబడెను. జూర్జియాప్రాంతమున కారన్ వాలీసు ప్రభువు ఆంగ్లేయ సేనలను నడుపుచుండెను. జూన్ నెలలో జార్జియా రాష్ట్రమంతయు ఆంగ్లేయుల వశమయ్యెను.