పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

అమెరిక సంయుక్త రాష్ట్రములు


ములు రాబభక్తులతో నిండియుండెను. న్యూజర్సీలోనికి పోషింగ్టను ప్రవేశించినపుడు ప్రజలు భయము వలవను దేశద్రోహము వలనను వాషింగ్టనుకు సహాయముచేయ కుండుటను చూచియున్నాము, 1778 వ సంవత్సరమున వోమింగు మొదలగు ప్రాంతములలో రాజభక్తు లాంగ్లేయులతో చేరి ఎర్రయిండియసులను దేశభక్తు లమీద ఘాతకకృత్యములను చేయుటకు పురిగొలుపుటను చూచియున్నాము. దక్షిణమున నున్న జార్జియా కారొలీనా రాష్ట్రములలో రాజభక్తులు చాల పలుకు బడి గలిగియుండిరి. 1776, 79 సంవత్సరములలో కారోలీనారాష్ట్ర ములలో నేలికగ వాంశ్లేయులు, రాజభ క్తుల పటాలము లను పోగుచేయ గలిగిరి. ఈ రాష్ట్ర ములలో రాజభక్తులకును దేశభక్తులకును ఎడ =తెగని పోరాట ములుకలుగుచుండెను. ఇందువలన అన్ని రాష్ట్రము లలోను యుద్ద మాఖరగువరకును అమెరికను రాజభక్తులు ప్రబలియుండి మాంగ్లేయులకు కొంతవరకు సాయము చేయుచుండిరనట స్పష్టమగు చున్నది. కాని ఈ రాజభక్తులు స్వార్ధ పరులగనుండిరి. ధర్మపక్షమున తాము పనిచేయు చున్నామను నుత్సాహముగాని భగవద్దోదేశమును నెరవేర్చుచు న్నామను విశ్వాసముగాని వీరికి టేకుండెను. కావున నీరాజభక్తులు ఆంగ్లేయులు జయము లొంది నపుడు. వారిపక్షమున చేరు చుండుటయు, వారోడిపోవుచున్నపుడు జారి పోవుటయు చేయుచుండిరి. జయ మెటుపక్షముననున్నదో చూచి మరి వపర్తించుచుండిరి. కావున వీరి వలన నాంగేయు లకు తగిన చేయూతకలుగ లేదు. ఈ రాజభాక్తుల నుండి యొక పేరు పడసిన సేనాధిపతియయినను బయలు దేర లేదు. క్రమము గా