పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/172

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎమిదవ అధ్యాయము

153



నుండిరి. యుద్ధముచాలకాలము సాగినకొలదియునాంగ్లేయులు పెక్కువిధముల కృషి సలిపి యనేక యుపాయములచే నమరికనులను చీలదీసి రాజభక్తులను వివిధ ప్రాంతములలోను "బలపరచుటయేగాక రాజభక్తుల పటాలములను బయలు దేర దీసి అమెరికను స్వాతంత్ర్య వాదుల పై యుద్దములను చేయించు చువచ్చిరి. అమెరికాలోని రాజభక్తులే తమకు ముఖ్యమగు బలమని ప్రధమమున కొంతకాలమాంగ్లేయులు నమ్మియుండిరి. 1780 వ సంవత్సరం డిశంబరు నెలలో 8954 మంది రాజభక్తు లాంగ్లేయ పటాలములలో చేయండిరి. 1781 వ సంవత్సరము 7 వ మార్చి తేదీన " దేశీయమహాసభహరి , కిందనుండిన అమెరికను సైనికుల మొత్తము కంటే సొంగ్లేయ సేనలలో సుండిన 'రాజభక్తుల సంఖ్య ఎక్కువగ నున్నదని” ఆంగ్లేయ సేనాధి పతి వాసెను. 1781 వ సంవత్సరము సెప్టెంబరులో ఏడు వేల మంది. రాజభక్తు లాంగ్లేయుల సైనికకొలువునందుండిరి. మెనషు సెట్సు, మేరీలాండు, సెన్ని సర్వేనియా, న్యూయార్కు రాష్ట్రములలో బలమయిన రాజభక్తుల సంఘము లుండెను. న్యూయార్కుకు సమీపమున రాజ భక్తులొక కోటను కూడ నిర్మించి యుండిరి. 1776 వ సంవత్సారము నవంబరు నెలలో కనెక్టికటు రాష్ట్రములోని రాజభక్తులను ఖయిదుచేయుటకు వాషింగ్టను యాచించెను. 1776 సంవత్సరము మార్చిలో బోస్టనునుండి ఆంగ్లేయ సేనలతోకూడ వెయ్యిమంది రాజు భక్తులు వెళ్లి పోయినందున న్యూఇంగ్లాండు రాష్ట్రములలో రాజభక్తుల పక్షము మిగుల బలహీనమయ్యేను. చాలా కాలము వరకు న్యూయార్కు, ఎన్ని సల్వేనియా, న్యూబర్సి రాష్ట్ర