పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/171

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికా సంయుక్త రాష్ట్రములు

152


డించి ధ్వంసము చేయుచుండిరి. న్యూహావను మొదలగు పట్టణ ములను దోచుకొని తగుల బెట్టిరి. స్టోనీ పాయంటును న్యూయార్కు ఎదురుగనున్న మరియొక కోటను వశపరచు కొనిరి. (ఆగష్టు 19 ) జనరలు మెక్లీయను కింద మరియొక యాంగ్లేయ సైన్యము మెసష సెట్సులోని పెనబుస్కాటు బే సాక్రమించెను. వీరిని వెడల గొట్టుటకు మెసషు సెట్సు రాష్ట్రమువారు గొప్ప అమెరికన్లు సెస్యమును బంపిరి. గాని అమెరికనులు పూర్తిగ నోడిపోయిరి. వీరి పడవలను అంగ్లేయులు పట్టుకొనిరి. కొన్నిటిని ఆమెరికనులే తగులబెట్టుకొనిరి. అనేక మంది సైనికులు అరణ్యములలోనికి పారిపోయి యచట మరణించిరి. ఆ ప్రదేశమంతయు నాంగ్లేయుల వశమయ్యేను.

అమెరికను
రాజభక్తుల భావములు.


అమెరికను రాజభక్తుల సంగతియేమి? మాతృదేశ మగు ఇంగ్లాండు నుండి పూర్తిగా స్వతంత్ర మును పొందుట కమెరికనులలో ననేకుల కిష్టము లేకుండెను, ప్రతి రాష్ట్రము లోని ప్రజలలోను సభిప్రాయ భేదములు గలవు, అధిక సంఖ్యాకులు స్వాతంత్ర్యపక్షమున నుండటయు దేశీయమహాజన సభవారధికసంఖ్యాకుల ప్రతి నిధ్యము వహించుటయు నిర్వివాదమగువిషయమే. కానీ కొంత దృఢమైన సంఖ్యయే స్వాతంత్ర్యముసకు వ్యతిరేకులుగ నుండిరి. వీరిలో ధనవంతులును పలుకుబడిగల వారును గూడ గలరు. వీరాంగ్లేయ రాజునందు తమరాజభక్తిని ప్రకటించుట యేగాక రాజభక్తుల సంఘముల నేర్పరచి తమ యభిప్రాయములను వ్యాపింపజేయుచుండిరి. కొన్ని రాష్ట్రములలో నీరాజభక్తు లెక్కువ బలవంతులుగను మరికొన్ని చోట్ల బలహీనులుగను