పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అమెరికా సంయుక్త రాష్ట్రములు

118



ప్రకటనము స్యూయార్కు రాష్టముగాక మిగిలిన యన్ని రాష్ట్రముల ప్రతినిధుల చేతను నేకగ్రీవముగా నంగీరించ బడెను. దీనిలో నిమిడియున్న ముఖ్య సూత్రములు అన్ని కాలములలోను ఇతరులచే వత్తిడి చేయబడి స్వాతం త్యయి.ను గోరుజాతుల కాశను పురిగొల్పుచున్నవి. మరియు ప్రపంచములోని రాజకీయ విప్లవముల కెల్ల పునాదిగ సున్నవి.

అమెరికనులలో మితి లేని
యుత్సాహము

ఈ స్వాతంత్య ప్రకటనము సంయుక్త రాష్ట్రముల ప్రజలలో మితిలేని యుత్సాహమును కలుగచేసెను. ఫిలడల్ఫియా పట్టణముననున్న స్వాతంత్ర్య పుర మందిరములో జయ సూచక ముగ గంటలు లేని మోగించబడెను. "దేశములోని యందరు ప్రజలకుసు స్వతం త్రము" అని యాపురమందిరము మీద చిత్రించబడెను. వర్జీనియా రాష్ట్రము ప్రజాస్వామ్యమయినదని చట్టమును చేసినది. న్యూయార్కులో మూడవ జార్జి సార్వభౌముని పత్రిమ పజలచే నాశనము చేయబడినది. స్వాతంత్ర్య ప్రకటనను, వాషింగ్టసుకు చేరిన 9న జులై దినమున సైనికుల నందరిని నిలున బెట్టి వినిపించెను. సైనికులందరును నెత్తిమీది టోపీలు తీసి బహు నంరతతో నాలకించిరి. . (6)

ఆంగ్లేయులు
జయమొందిరి

కాని దుర్దినములు రానున్నవి, న్యూయార్కు పట్టణము నందు వాషింగుటను సేసలుండెను. దానిని బలపరచుటకు వాషింగ్టను కోటలను కట్టు చుండెను. దానికి సమీపముననున్న లాంగు ద్వీపములో తొమ్మిది వేల అమెరికను సైనికులు సల్లిపను సర్లింగు సేనానుల