పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ అధ్యాయము

119



క్రింద విడిసి యుండెను. ఆంగ్లేయ నౌకాదళ మొకవైపు నుండియు సేనలొక వైపునుండియు ఆగస్టు 27వ తేదీన నీలాంగు ద్వీపములోని అమెరికను సేనలను ముట్టడించెను. ఆంగ్ల సేనలు చాలసధికముగ వచ్చి పైబడెను. ఉభయులకు జరిగిన పోరాటములో ఆంగ్లేయులు, పూర్తిగ జయమొందిరి. ఇద్దరమెరికసు సేనాసులను వెయ్యిమంది అమెరికను సైనికులను ఖయిదుచేసిరి. ఆరువందలు అమెరికసులు హుతులైరి. న్యూయార్కులో స్వల్పసంఖ్యగల సేనలు మాత్రమే యుండినందున వాషింగ్టన్ సహాయము చేయజులక పోయెను. ఆగషు 29 వ తేది రాత్రి వేళ మిగిలిన సైనికులందరు ఎటులనో వాషింగ్టన్ న్యూయార్కు పట్టణములోనికి చేర్చెను. లాంగు ద్వీపములో నమెరికనులకు గలిగిన యపజయము చాలవరకు వలస ప్రజలకే గాక అమెరికను సైనికులకు గూడ నిరుత్సాహమును కలుగచేసెను. 2 వ సెప్టెంబరు తేదిన వాషింగ్టను దేశీయ మహాజనసభ వారి కిటుల, వ్రాసెను ' మనస్థితి మిగుల దుఖకరౌగనున్నది. లాంగు ద్వీపపు యుద్ధము వలన మన ఐచ్చిక సైనికులలో నధిక సంఖ్యాకులు అధైర్యమును నిరాశసు చెందినారు. సైనికు లిండ్లకు పోవుటకు ఆతురతను జూపుచున్నారు. అనేక మంది యిదివరకే చెప్పకుండ పారిపోయినారు. కొన్ని పటాలములు యావత్తును కొన్ని కొంతవరకును నీవిధమున ఖాలీ అయినవి. మిగిలియున్న సైనికులోర్పునుగాని నిగ్రహమును గాని విధేయతసుగాని చూపుట లేదు. నాకీఐచ్చిక సైస్వముల యందు విశ్వాసముపోయినదని వ్రాయుటకు చింతిల్లుచున్నాను. "యుద్ధ మాఖరగువరకు స్థిరముగానుండు సైన్యముల నేర్పాటు చేసిన A