పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ ఆధ్యాయము

117


న్యాయమును చూపుదురని ఆశించియుంటిమి. కాని మా ఆశ నిరాశయైనది. న్యాయమునకును ధర్మమునకును ఆంగ్ల ప్రజలు పెడచెవిని పెట్టినారు. "అని, వ్రాసిరి. కావున దేశైయమహాజనసభలో సమావేశమైన అమెరికా సంయుక్తరాష్టృముల ప్రతినిధులమైన మేము మాయొక్క యుద్దేశ్యముల పవిత్రతనుగూర్చియు మాపక్షము యొక్క న్యాయమును గూర్చియు జాతుల యదృష్టమును నిర్ణయించు పరమేశ్వరునికి మనవిచేసికొనుచు; సంయుక్త రాష్ట్రములలో నివశించు ప్రజలతరఫునను వారి అధికారము క్రిందను, సంయుక్త రాష్ట్రములు స్వతంత్రమైన రాష్ట్రములుగ నేర్పడినవనియు స్వతంత్రమును పొందుటకు హక్కు కలిగి యున్నదనియ; బ్రిటిషు రాజునకు చూపవలసి యుండిన రాజభక్తి నుండి పూర్తిగా విముక్తి చెందినవనియు ఆంగ్లేయరాజ్యమునకును మాకును గల రాజకీయ సంబంధము సంపూర్ణముగ తొలగిపోయిన దనియు స్వతంత్రమైన రాష్ట్రములయినందున సంయుక్తరాష్ట్రములవారు యుద్ధముచేయుటకును సంధి చేసుకొనుటకును యొడంబడికెలలో ప్రవేశించుటకును వర్తకపు టేర్పాట్లుచేయుటకును స్వతంతమైన ప్రభుత్వములు చేయగల సమస్త ఇతర కార్వములను నిర్వర్తించుటకును సంపూర్ణమగు హక్కును కలిగియున్నారనియు దృఢదీక్షతో ప్రకటించుచున్నాము. ఈప్రకటనసలు సఫల సుగుటకై ధర్మ స్వరూపుడగు భగవంతుని మీద పూర్తి భారము వైచి మాప్రాణములను మాఆస్తులను పవిత్రమైన మాగౌరవమును సమర్పించుచున్నామని తెలియజేసిరి. ఈస్వాతంత్ర్య