పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఏడవ అధ్యాయము

103



సమీపించుచున్నది. కొంతగడువు వరకు మాత్రము పనిచేయు వలెనని వివిధ రాష్ట్రములనుండి ఐచ్చిక జాతీయ సైనికు లను పోగుచేసి యుండిరి, గడువుకాగనే వారు స్వగృహములలో చేరెదరు. కనెక్టికటు, రోడుఆయిలండు సైనికుల కాలము డిశంబరు ప్రధమ తేదీనను మెసషు సెట్సు నుండి వచ్చినవారి గడువు డిశంబరు నెలాఖరునను ముగియును. . ఆ దేశీయమహా జన సభ వారికి ఋణములు తగినంత పోగుకాలేదు. చేతిలో సొమ్ము లేదు. కాని బాస్టనును వాషింగ్టను స్వాధీన పరచు కొనవలెనని మాత్రము దేశములో నాత్రత యుండెను. ఈ సందర్భములలో బాస్టనును ముట్టడించుట వెర్రితనమని వాషింగ్టన్, నీసంగతుల నన్నింటిని దేశీయమహాజన సభ వారికి విపులముగ తెలియచేసిన మీదట బెంజమిను ఫొrక్లీను అధ్యక్షత కింద నిరువది మూడు వేల మంది సైనికులను జమచేయుటకును వాషింగ్టనుతో సంప్రదించుటకును నొక యపసంఘము నేర్పాటుచేసిరి.


2

{రాష్ట్రములలో
స్వతంత్ర స్థాపనము}

ఈ సమయమున . దక్షిణ రాష్ట్రములలో సొంగ్లేయురాజ్యాధికారము తొలగిపోవుచుండెను. వర్జీనియా రాష్ట్రపుగవర్నగు డను మొరు ప్రభువుఅక్కడి మందుగుండు సామానును వశపరచు కొనెను. రాష్ట్ర ప్రతినిధిసభ వారు సమావేశమై యా మందుగుండు సామాగి యొక్క మూల్యమును గవర్నకువద్ద నుండి బలవంగముగ వసూలు చేసి యాసొమ్మును దేశీయ మహా జనసభవానికి పంపిరి. తరువాత కొలది కాలముసకు ప్రజలకు