పుట:Amerikaa-Sanyukta-Rashtramulu.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

102

అమెరికాకు యుక్త రాష్ట్రములు



{సేనల
హెచ్చిరిక

ఈ యుద్దము జరిగిన దినముననే దేశీయమహాజన సభవారు నలుగురు సేనాధిపతులను ఎమిది మంది సహాయ నేనానులను కూడ నియమించిరి. ఎర్రయిండియనులు తటస్థముగ నుండుసట్లేర్పాటు చేయుటకై కొంత దవ్యముతో కొందరు రాయబారులను పంపిరి. జూను 21 వ తేదీన జార్జి షింగ్టను, సర్వసేనాధి పత్యమూ వహించుటకు బయలు చే రెను. త్రోవలో బంకరు కొండ యుద్ధసమాచారము తెలసెను. సైన్యములవద్దకు, చేరగనే వారివుడు అమెరికా సంయుక్త రాష్ట్రముల సైనికులనియు రాష్ట్ర భేదములు నశించి యందరిని యొకేజాతీయభావము పురిగొలు పవలెననియు మనమందర వలంబించి మున్న పోరాటములో నెవ రెక్కువ సేవచేయుదురను తలంపుమాత్రమే వారి మనను కందుఁడవలెననియు సేనలతో హెచ్చరికను బంపెను. గాని సేనలు మంచిస్థితియందు లేవు, సేనాధిపతులు అసమర్ధులు, సైనికులు అవిధేయులు, వాషింగ్టను తరుచుగ సైనికులను కఠినముగ శిక్షించుచు వారిలో జాగ్రత్తను విధేయతను కలుగ జేసెను. సేనలన్ని యు బాస్టను పట్టణము చుట్టునుంచబడినవి. ఆంగ్లేయ సైనికులకును అమెరికను సైనికులకును తరచుగ చిన్న చిన్న కలహములు కలుగుచుండెను. వాషింగ్టనేమి చేయుటకును మందుగుండుసామాను బహుస్వల్పముగనున్నది. అదయి పోగానే చేయవలసిన దేమియో తోచకుండెను. రోడు. అయిలండు న్యూయార్కు మొదలగు రాష్ట్రముల వారికి , మందు గుండు సామానెంత స్వల్పముగ లభించినను పంపవలసిన దని వ్రాసెను. ఇంతలో సైనికుల నిర్నయకాల సమాప్తి,