3
పదములచే విశదమగు నర్థము సూచితమగు నట్లు సంపూర్ణముగా జెప్పుచున్నాను.
- అవ
- లింగజ్ఞానోపాయ మే విధముగా ననగా:.............
- శ్లో
- ప్రాయశో రూప భేదేన సాహచర్యా చ్చ కుత్రచిత్,
స్త్రీ పు న్నపుంసకం జ్ఞాయం తద్విశేషవిధేః క్వచిత్. .............3
- టీ.
ప్రాయశః = తరుచుగా, రూపభేదేన = రూపముయొక్క భేదము చేతను, కుత్రచిత్= కొన్ని తావులందు, సాహచార్యాత్= ముందు వెనుకటి పదముల నుంచుట వలనను, స్త్రీ పుం నపుంసకం = శ్త్రీ లింగ పుంలింగ నపుంసక లింగములు, జ్ఞఏయమ్= తెలియదగినవి, క్వచిత్ = కొన్ని చోట్ల. విశేషవిధేః = ప్రత్యేకముగా ఈ పదమీలింగమని చెప్పుట చేతను, తత్ = ఆ స్త్రీలింగ పుల్లింగ నపుంసక లింగములు, జ్నేయమ్=తెలిసికొనదగినవి.
- తా
- కొన్ని చోట్ల రూపభేదముచేతను, (విసర్గ మున్న యెడల పుల్లింగమనియు, దీర్ఘాంతముగ నున్నయెడల స్త్రీ లింగమనియు, బిందువుతో నున్న యెడల నపుంసకలింగ మనియు) కొన్ని చోట్ల ముందు వెనుకటి పదముల సంబంధము వలనను, కొన్ని చోట్ల ప్రత్యేకించి ఈ పద మీ లింగమని చెప్పుట చేతను లింగము చెలిసికొనవలెను.
- ఉదా
1. రూపభేదము: పద్మాలయా పద్మా, పినాకో, 2. జగవం ధనుః... ఇచ్చట 'పద్మా' అని ఆకారంతమగుట చే స్త్రీ లింగమనియు, 'పినాకః' అని విసర్గముతో నుండుట చే పుంలింగ మనియు, 'అజగవం' అని బిందువుతో గూడియుండుతచే నపుంసక లింగ మనియు చెలియ వలయును.
2. విశేషణపదము:.... తత్పరో హనుః అను చోట బుంలింగ మయిన తత్పర శబ్దము చేత హను శబ్దము పుంలింగ మని తెలియ వలయు.
3. సాహచర్యమున ననుటకు భానుఃకరః వియద్విష్ణు పదం అశ్వయు గశ్వినీ ఈ యుదాహరణము లందు కర శబ్ద