ఈ పుట ఆమోదించబడ్డది
2
గురువుయొక్క, గుణాః = దయాశౌచాది గుణములు, అనఘాః = పాపములను బోగొట్టునవో, సః = అట్టి, అక్షయః = విష్ణు భక్తుడైన (హింసారహితుడైన,) ధీరాః = జ్ఞానము నొసంగు నట్టి గురువు, శ్రియేచ = సంపద కొరకును, అమృతాయచ = మోక్షము కొరకును, సేవ్యతామ్= కొలువబడును గాక.
- తా
ఈ పుణ్యాత్ములారా.... మీరు ఐహికాముష్మిక సుఖంబులను బొందగోరిన, జ్ఞానమునకును, దయకూ సముద్రుని వంటివాడు, జితేంద్రియుడు, నైన గురువును సేవింపుడు. అతను సంపదయు, దయాదాక్షిణ్యాది గుణంబులూ గలవాడు గాన మీకు సకల సంపదల నిచ్చును.
అనగా కవి తన గ్రంథమునకు బేరును ప్రయోజనమును దెపుట:....
- శ్లో
- సమాహృత్యాన్యతాన్త్రాణి సంక్షిప్తైః ప్రతి సంస్కృతైః,
సంపూర్ణ ముచ్యతే వర్గై ర్నామలిజ్గానుశాసనం........................2
- టీ
- అన్యతాన్త్రాణి - అన్య = వ్యాడినరుచిని మొదలగు వారి యొక్క, తన్త్రాణి = నామలింగాను శాసనములను, సమాహృత్య = చక్కగా చూచి, సంక్షిప్తైః = గ్రహింపబడిన, ప్రతి సంస్కృతైః = వేర్వేరుగా గ్రమము గలిగింప బడిన, వర్గైః = వర్గముల చేత, సంపూర్ణమ్= కొరత లేకుండునట్లు, నామలింగాను సాశనమ్= నామ లింగాను శాసన మను నిఘంటువు (నామములను, లింగములను విశదీకరించి చెప్పునది, ) మయా = నాచేత ఉచ్యతే = చెప్పబడు చున్నది.
- తా
- వ్యాడివరరుచి మొదలగు వారిచే రచియింప బడిన నిఘంటువులు మిగుల పెద్దవై కొన్ని నామములను మాత్రము బోధించునవియు గొన్ని లింగములను మాత్రము బోధించు నవియునుగా నున్నవి. ఆ నిఘంటువుల నెల్ల సంగ్రహించి నామలింగాను శాసన మను పేరనొక నిఘంటువును వ్యర్థ పదములు లేక చిన్నచిన్న