పుట:AmaraKosam.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శ్రీరస్తు.

అమరకోశము, సటీకము

ప్రథమకాండము

శ్లో
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతం,

 ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ముపాస్మహే.

అవ. అమరసింహుడను కవి సార్వభౌముడు రచింప బూనిన నామలింగానుశాసన మను నిఘంటువు నిర్వఘ్న పరిసమాప్తి నొందుటకై మంగళమును శిష్య శిక్షార్థము రచించెను.


శ్లో
యస్య జ్ఞాన దయాసిన్దో రగాధ స్యానఘా గుణాః

సేవ్యతా మక్షయౌధీరాః సశ్రియే చామృతాయ చ..................1

టీ
హే అనఘాః = ఓ పాపరహితులారా... అక్షయః = విష్ణువు నందు నివాసము - లేక జ్ఞానముగల (బ్రహ్మనిష్ఠుడైన) - లేక(బ్రహ్మనిష్ఠుడైన) లేక హింస పెట్టుటలేని, ధీరాః = జ్ఞానము నొసగు నట్టి, సః = ప్రసిద్ధుడైన గురువు, (భవద్భిః = మీచేత,) శ్రియేచ = భాగ్యము కొరకును, అమృతాయచ = మోక్షమును కొరకును, సేవ్యతామ్= సేవింప బడుగాక, జ్ఞానదయా సిన్ధోః = జ్ఞానమునకును, కారణము లేకయే పరుల యాపదలను బోగొట్టనెంచుట యను దయకును, సిన్దోః = సముద్రమువంటి వాడయినట్టి, అగాధస్య= లక్ష్మియు, గుణాః = సత్యము, శౌచము, జ్ఞానము, శాంతి, దాంతి దొలగు గుణములును (సవిన్తి = వున్నవి.)
అర్థాంతరము

జ్ఞానదయాసిన్ధోః = జ్ఞానమునకును దయకును సముద్రము వంటి వాడును, అగాధస్య = ఇంద్రియములకు లోబడని, యస్య = ఏ