పుట:AmaraKosam.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాహచర్యముచే భాను శబ్దము పుంలింగ మనియు, విష్ణుశబ్ద సాహచర్యముచే వియత్పదము నపుంసక లింగమనియు, అశ్వినీపదసాహచర్యముచే అశ్వయుక్పదము స్త్రీలింగమనియు దెలియ వలయు. సాహచర్య మనగా స్పష్టమైన లింగము గల పదము ననుసరించుట.

4. విశేష విధిచే తెలియ వలయు ననుటకు ఉదా: భేరీ స్త్రీ దుందుభిః వుమాన్ ఇచ్చట భేరీ దుందుభి శబ్ధములు వేరు లింగములు గలవగుటచే భేరి స్త్రీ యనియు దుందుభిః వుమాన్ అనియు చెప్పబడినవి. రోచిః శోచి రుభేక్లీ భే అనుచో రోచిః శోచిః అను పదములు రెండును నపుంసకము లని తెల్పుటకై క్లీ భే = నపుంసకము నందు అని చెప్పబడినది.

అవ. పూర్వోక్త విధుల చేత ద్వంద్వ సమాసాదుల యందు లింగము నెరుంగరాదను శంక తొలగుటకై
...
శ్లో
భేదాఖ్యానాయ న ద్వన్ద్వో నైక శేషో న సజ్కరః,

కృతోఽత్ర భిన్నలిజ్గానా మనుక్తానాం క్రమాదృతే.

టీ
అత్ర = ఈ గ్రథము నందు, అనుక్తానాం = వాని వాని పర్యాయ ములందు జెప్పబడని, భిన్నలిజ్గానామ్= వేర్వేరు లింగములు గల పదముల యొక్క, భేదాఖ్యానా=లింగ భేదమును దెలుపుటకు, ద్వన్ద్వః = ద్వంద్వ సమాసము, న కృతః = చేయ బడలేదు, ఏక శేషః = ఏక శేష వృత్తియు, నకృతః = చేయబడలేదు. క్రమాదృతే = వరుసను దప్పించి, సజ్కరః = వేరు వేరు లింగములు గల పదములను గలుపుట, న కృతః = చేయబడలేదు.

ఈ నిఘంటువు నందు నొక్క చోట లింగ నిర్ణయము చేయ బడని పదములు వేరు వేరు లింగములు గలవిగా నుండునేని వాని ద్వంద్వసమాసము ఏక శేష వృత్తియు జెప్పబడలేదు.

ఉదా:... 'దేవతాదైవతామరాః' అని చెప్పబడలేదు. ఏలయనిన, దేవతా శబ్దము స్త్రీలింగము. దైవతశబ్దము నపుంసక లింగము అనుగనబము పులింగము 'దేవతాదేవతామరాః' అని