పుట:Aliya Rama Rayalu.pdf/87

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

             అమితకర్ణాటరాజ్యస్థాపనాంక
             రమణియ్యు డగునట్టి రామభూపతియు"
                               (ద్విపదబాలభాగవతము)

      "ఉ. ఏపునద్రోహిభావమువహించినసల్కయతిమ్మరాజు ద
          త్పాపసహాయు సల్కయయుతంబుగ శౌర్యము మీఱద్రుంచి వి
          ద్యాపురియందు చాలఘను డయ్యె సదాశివరాయ రాజ్య సం
          స్థాపకు డైసిరంగవసుధావర రామనరేంద్రు డున్నతిన్."
                               (పద్యబాలభాగవతము)

ఆరవీటి శ్రీరంగరాజుపుత్త్రుడగురామరాజు ద్రోహియైన సలకముతిమ్మరాజును నాపాపికిసహాయుడుగా నుండిన సలకరాజును సంహరించికర్ణాటసామ్రాజ్యమునకు సదాశివరాయని బట్టాభిషిక్తుని జేయుటచేతనే సదాశివరాజ్యసంస్థాపకు డనిప్రఖ్యాతి గాంచి విద్యాపురమునందు మిక్కిలి ఘనుడయ్యె నని దెలిపి యున్నాడు. కృష్ణదేవరాయని కల్లుడైనను వానికాలమునగాని, అచ్యుతదేవరాయల కాలమునగాని రామరాయలు విద్యానగరమునం దొకప్రముఖుడుగా నున్నట్టు ప్రమాణము గానరాదు. ఈఘనకార్యమును జయప్రదముగా నిర్వహించిన కారణముచేతనే బాలభాగవత గ్రంథకర్త వ్రాసినరీతిని విద్యాపురియందు గొప్పఘనుడుగా బరిగణింపబడినది వాస్తవమని చెప్పదగును.