పుట:Aliya Rama Rayalu.pdf/86

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నున్న రాజనాథ డిండిమకవి రచియించిన యచ్యుతరాయాభ్యుదయమను గ్రంథమునను, ఆతనియాస్థాన కనయిత్రియగు తిరుమలాంబ రచియించిన వరదాంబికాపరిణయ మనుగ్రంథమునను సలకముతిమ్మయ యచ్యుతదేవరాయల భార్యయగు వరదాంబికతోడబుట్టినవా డనితెలుపబడియుండ నేతద్గ్రంథకర్తలు కవులయినమాత్రముచేత వానినివిశ్వసింపక 'సలకముతిమ్మయ యచ్యుతదేవరాయల తోబుట్టువుపెనిమిటి' యని 'కోరియా' వ్రాసిన దానిని విశ్వసించినయెడల యెంత హాస్యాస్పదముగనుండును? సమకాలికులైనకవులు వ్రాసినవర్ణనాంశములలో నతిశయోక్తు లుండిన నుండవచ్చునుగాని వారుసత్యమునే వ్రాయలేదని నిరాకరించుట సత్యచరిత్ర నిర్మాణమునకు దోడ్పడుమార్గ మగునా?

విజయనగరములో క్రీ. శ. 1542 వ సంవత్సరప్రారంభమున విప్లవము పుట్టినది. 1547 లో దోనూరుకోనేరునాథకవి ద్విపదబాలభాగవతమును రచియించి యళియరామరాయల పెదతండ్రికుమారులలో నొక్కడగుచిన్నతిమ్మరాజునకును, తరువాత పద్యప్రబంధముగారచించి యతనితండ్రికి నంకితముచేసిన యాగ్రంథములపీఠికలలో నారవీటివంశమును వర్ణించుచు నళియరామరాయలను గూర్చియిట్లుప్రశంసించి యున్నాడు.

         "శ్రీసదాశివరాయ శేషరమణికి
          భాసురసామ్రాజ్యపదవి నొసంగి