పుట:Aliya Rama Rayalu.pdf/88

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇదియునుంగాక రామరాయనిపక్షము వారికిని సలకముతిమ్మయపక్షమువారికి మాత్రమెగాక రామరాయనిపక్షమువారికిని సలకముతిమ్మయపక్షము వహించివచ్చిన విజాపుర విదర్భసుల్తానులకు గూడ యుద్ధము జరిగినటుల దెలుపు నొకటి రెండు విషయములను ద్విపదబాలభాగవత గ్రంథముల బేర్కొని యున్నవాడు. ద్విపదబాలభాగవతమును నంకితము నొందినట్టి యారవీటిచినతిమ్మరాజు క్రీ. శ. 1542 వ సంవత్సరములో చంద్రగిరిరాజ్యమును పరిపాలించుచున్నట్లు తిండివన శాసనము దెలుపుచున్నది. [1] అచ్యుతదేవరాయలు 1541 లో మరణించెను. వానివెనుక వానికుమారుడు చిన్నవేంకటాద్రి 6 మాసములు పరిపాలనముచేసినవెనుక వానిమేనమామ సలకముతిమ్మయ వానిసంహరించి సామ్రాజ్య మాక్రమించుకొన్నవిషయ మిదివరకె తెలుపబడినది. ఇట్లుండగా ద్విపదబాలభాగవతమునందు దత్కృతిభర్త యైనయారవీటి చినతిమ్మరాజు.

           "సరినృపుల్ ప్రజలును జయవెట్ట చంద్ర
            గిరిముఖ్యదుర్గముల్ గినిసి కైకొంటి"

  1. A Topographical list of the Inscriptions by Rangacharya Vol. I. P. 402, 717; 33 of 1905; 250 of 1910; other records of prince china Timma will be found in Rangacharya, 11 p. 915, 60 and 70; p. 976, 608.