పుట:Aliya Rama Rayalu.pdf/84

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

చేసి యుండలేదు. సలకముతిమ్మయస్వాధీనములో నున్నప్రభువు లెల్లరురామరాయలవలన లంచములు తిన్నవారే యైనయెడల సామ్రాజ్యమునకు ప్రబలశత్రువయిన విజాపురసుల్తానుని రప్పించి విజయనగరరత్నసింహాసనమున గూరుచుండ బెట్టుట కెట్లుసహింప గలిగిరోహీరాసుఫాదిరి తెలిపి యుండలేదు. మఱియు విజాపురసుల్తానువంటిగడుసరిప్రభువు తనశత్రురాజధానిలో సామ్రాజ్య సింహాసనమున దన్ను గూర్చుండ బెట్టి తన్ను సామ్రాజ్యాధిపతినిగా జేసి, సామంతులై తన్ను గొల్చుట కంగీకారముదెలిపియున్నప్పుడు, పిఱికిపందయై రాజధానివిడిచిపెట్టి పాఱిపోయినవాడు వంచనతో వ్రాసినజాబును నమ్మి సలకముతిమ్మయప్రార్థించినమాత్రమున దనకు నప్రయత్నపూర్వకముగా లభించినయీశత్రుసామ్రాజ్యమును, సింహాసనమును విడిచిపెట్టి ద్రవ్యమునుమాత్రము గ్రహించి వెడలిపోవు నంతటియవివేకి యనిగ్రహింప నగునా? రామరాయలపక్షమువారు విజాపురసుల్తానునకు సామంతులమై వానిని సామ్రాజ్యాధిపతినిగా గావించివానికణకువతో గప్పములు చెల్లించుచుందు మని దురాలోచనచేయుచున్నవా రనియేగదా వారిపక్షమున నుండకుండ విశేషద్రవ్యము లంచముగా నిచ్చి యాతనిదనకు సహాయార్థము రప్పించుకొన్న సలకముతిమ్మయ వారినిద్రోహులనియు వారినిజేర్చక మరలవారిని వారిస్థానములకు బంపివేయవలసిన దనిజాబువ్రాసినపు డయ్యదిమోసమని తెలిసికొనజాలక యేలయెనుబదిలక్షలహొన్నులసమర్పించు