పుట:Aliya Rama Rayalu.pdf/83

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ముచెల్లించుచుందు ననియు వారిచే జెప్పించి, వానిసైన్యములతోసహా వానిని రప్పించి, విద్యానగరసింహాసనమున వానిని గూరుచుండ బెట్టియేడుదినములు మహావైభవముతో వేడుకలు జరిపియుండె ననియుకొందఱుప్రభువులుగూడ నాతనిసామ్రాజ్యాధిపతిగా నొప్పుకొనిరనియు, రెండవమాఱు వ్రాసియున్నట్లుగా హీరాసుఫాదిరి తాను, వ్రాసినయారవీటివంశచరిత్రమునందే దెలిపి యున్నాడు.[1] మొదటవ్రాసినదిసత్యమో, రెండవమారువ్రాసినది సత్యమో, హీరాసుఫాదిరి నిర్థారణచేసి యుండలేదు. రెండువిధములుగూడ సత్యమై యుండు నని వీరియభిప్రాయమై యుండవచ్చును. సామ్రాజ్యధనాగారమంతయు సలకముతిమ్మయచేతిలో నుండెనుగాని యళియరామరాయలచేతిలో లేదనివారే యొప్పుకొనుచున్నారు. లక్షలకొలదిహొన్నుల ద్రవ్యమును విజాపురసుల్తానునకు సమర్పింపగలిగినసలకముతిమ్మయ ధనాశాపీడితులయిన తనయనుచరవర్గమునకు దృప్తికలుగునట్లు ధనమునొసంగి తనప్రక్కనుంచుకొనుట కేలసాధ్యపడ దయ్యెను? వీరలకు లంచముల నొసంగుటకు నాకస్మికముగారాజధానివిడిచి సోదర ద్వయముతో బాఱిపోయినరామరాయల కీప్రభువులకందఱకు లంచముల నొసంగి తనప్రక్కకు ద్రిప్పుకొనుటకు వారలకు ధనమెక్కడనుండి యొక్కమాఱుగాలభించినదియు నిర్ధారణము

  1. A.D.V. Page 6; Correa. Page 247 - 8 Ibid Page 8; Correa, Pages 277 - 278 - 279.