పుట:Aliya Rama Rayalu.pdf/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శత్రుపక్షమునజేరి తనశత్రువుచే దర్బారున బరిభవింపబడి వెడలగొట్టబడినపిఱికిపందను జూచి సంతోషించి శ్రీకృష్ణదేవరాయలవంటిశూరచక్రవర్తి తనయేకపుత్రికనిచ్చి వివాహము చేసెనన్న నెట్లు విశ్వసింప దగును? రామరాయలయెడ గల యసూయ యాయనామక చరిత్రకారునిగాని, చరిత్రకారుడగు ఫెరిస్తానుగాని యిట్టియసత్యకల్పనమునకు బురికొల్పిన బురికొల్పవచ్చునుగాని యదియొక వింతగాదు. ఇరువదవశతాబ్దిలోనుండిన హీరానుఫాదిరి వంటి చరిత్రకారుడు రామరాయలతండ్రి శ్రీరంగరాజు కృష్ణదేవరాయనిమంత్రియని యొక ప్రక్కనొప్పుకొనుచు తానువ్రాసిన యారవీటివంశచరిత్రము నందు నాయనామక చరిత్రకారునియొక్కయు ఫెరిస్తాయొక్కయు నసత్యకల్పనములను సత్యాంశములనుగా విశ్వసించి వ్రాయుట యాశ్చర్యకరముగా నుండకమానదు. రామరాయల మంత్రులలో నొకడుగానుండి యాతనిచే నొకప్పుడు కొండవీడురాజ్యమునకు బ్రతినిధి పాలకుడుగా నియమింపబడిన రామయామాత్య తోడరమల్లనునాతడు రామరాయలతమ్ముడగు వేంకటాద్రి ప్రేరేపణచే రచియించి రామరాయని కంకితముగావించిన 'స్వరమేళకళానిధి' య్నుగ్రంథమున నీక్రింది భావముగలశ్లోకములను వ్రాసి యున్నాడు.[1] చంద్రవంశమున

  1. ఏషాంకులాలంకృతరేష జఝే శ్రీరంగనాధో జితిరాజరాజ:
    తయాసదాచారదృశా వివింతే రాజర్షిభావం రమితక్షమోయ:||
    తిమ్మాంబికా తస్యబభూవదేవీ సాధ్వీ జనానామివయాసమిష్టి:
    సతీయశోదావినతానసూయా సుదక్షిణాసత్యవతీ సుభద్రా||
    తపోవిశేషణ తయోరశేష రాజాధిరాజోజని రామరాజ"
    కన్యాప్రదోస్మై సహి కృష్ణరాయ: కన్యాపితృత్వం బహుమన్య తేస్మ||