పుట:Aliya Rama Rayalu.pdf/64

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

జనించి యనేకరాజన్యులను జయించియు బ్రకటసాత్తికుడై సదాచారతత్పరుడై రాజర్షిభావముతో నొప్పుచుండెడి శ్రీరంగరాజు సకలసద్గుణగణంబులచేతను యశోదావినతానసూయాసుదక్షిణాసత్యవతీ సుభద్రలకు సాటియైన తిమ్మాంబికను వివాహము చేసికొనియెను. ఆదంపతుల తపోవిశేషముచేత వారలకు రామరాజు జనియించెను. అట్టిరామరాజునకు కృష్ణరాయలు తనకూతునిచ్చి వివాహముగావించి మహానుభావుడైన రామరాజునకు భార్యగా నుండదగినకన్యకు దానుతండ్రియై యున్నందులకు గర్వపడుచుండెను.

ఇతడు కృష్ణరాయల కల్లుడగుటచేతనే ఇతనినామమునకు మొదట 'అళియ' శబ్దము చేర్పబడి 'అళియరామరాయ' లని సామ్రాజ్యప్రజలతో వ్యవహరింపబడుట సంభవించినది. ఆరవీటివంశములో రామరాయనామములు పెక్కండ్రుండుటచే సామ్రాజ్యాధిపతి కల్లుడయిన కారణమున 'అళియరామరాయ' లనునామము సామ్రాజ్యమున బ్రాముఖ్యతను గాంచినది. కృష్ణరాయనికల్లుడయ్యును, కందనోలుమండలమును బాలించుమాండలిక ప్రభువయ్యును, కృష్ణరాయనికాలమున జరిగిన యేప్రసిద్ధదండయాత్రలయందును నితడు పాల్గొన్నట్లు చరిత్రమునం దితనినామము వినంబడకుండుటయే చిత్రముగానున్నది. ఈవివాహ మేసంవత్సరమున జరిగినదో యావివరముగూడ దెలియరాదు. కృష్ణరాయలకొమర్తె యగుతిరు