పుట:Aliya Rama Rayalu.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని ద్విపదపంక్తులలో నుదాహరించినందువలన నాద్రోహి యాదవేనిదుర్గాధిపతి యని దెలియుచున్నది. కాని నరపతివిజయమునందు:-

      "క. దీనావసు డౌకొండమ
          హీనాధుం డాదవేని నేలుచు బరగెన్
          దానును సుతులును దత్సం
          తానం బాయాదవేని ధామము పేరన్."

అనుపద్యమునుబట్టి యాదవేనిదుర్గమున కధీశుడుగ నున్నవాడు బుక్కయరామరాజు మూవురుపుత్త్రులలో రెండవవా డయినకొండరాజనియు, అందువలన నాతడును నాతని సంతతివారును నాదవేనివారని వ్యవహరింపబడి రనియును దెలియుచున్నది. ఈకొండరాజు తిమ్మరాజు తమ్ము డనుట సంశయింప బనిలేదు. ఇతడు వీరనృసింహరాయనికి నేల ద్రోహిగ నుండుట సంభవించినది? అన్నయగుతిమ్మరాజు ద్రోహియగు తమ్ముని కొండరాజు నేలజయించి వీరనృసింహరాయనివలన 'స్వామిద్రోహరగండపెండేరము' నెందుకు బొందవలసి వచ్చినది? మొదట వీరలతండ్రి యగుబుక్కయరామరాజు కాచాధీశునిజయించి యాదవేనిదుర్గమును స్వాధీనపఱచుకొనియె నని ద్విపదబాలభాగవతమున జెప్ప బడియుండుట చేతను, నరపతివిజయమునందు రెండవకుమారు డయినకొండరాజాదుర్గమును బరిపాలించుచున్నవా డనిచెప్పబడియుండుటచేతను, బుక్కయరామరాజు కాచాధీశుని జయించి యాదుర్గమును కొండరాజున