పుట:Aliya Rama Rayalu.pdf/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


కిచ్చె ననిసమన్వింపవలసి యుండును. విజయనగరసామ్రాజ్యము సంగమవంశమునుండి సాళ్వవంశమునకును, సాళ్వవంశము నుండి తుళువ వంశమునకును, తుళువవంశమునుండి యారెవీటివంశమునకును సక్రమించిన దనుట ప్రసిద్ధచరిత్రాంశము గదా. సాళ్వనరసింహరాయని కుమారు డగునిమ్మడి నరసింహరాయని సింహాసనమును దుళువవీరనృశింహరాయ (కృష్ణరాయనితండ్రి నరసరాయలు) తొడిచికొనుటకు గోపించి కొండరాజు వీరనరసింహరాయనిపై దిరుగబడి యుండును. అప్పు డీతనియన్న యగుపైతిమ్మరాజే వీరనృసింహరాయని పక్షము వహించి తిరుగబడినతమ్ముని యుధృతమును మాన్పి పైగండ పెండేరమును బొంది యుండును. వీరనరసింహరాయలు వానిని క్షమించి యాదవేనిదుర్గము నాతనిస్వాధీనముననే యుంచి యుండును.

శ్రీరంగరాజు


బుక్కయరామరాజు మూవురుపుత్త్రులలోను గడపటివాడు శ్రీరంగరాజు. ఇతడె అళియరామరాయలు తండ్రి. వీనిం గూర్చినచరిత్రాంశము లెవ్వియును గానరావు. నరపతి విజయమునందు,


      "క. ఆరాజన్యులతమ్ముడు
          శ్రీరంగాధీశ్వరుండు శ్రితసంరక్షా