పుట:Aliya Rama Rayalu.pdf/27

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

దేవగిరి రాజధానిగా గలమహారాష్ట్రసామ్రాజ్య మడుగంటినది. 1324 లో నోరగల్లు (ఏకశిలానగరము) రాజధానిగా గల యాంధ్రసామ్రాజ్యము విచ్ఛిన్నమైపోయినది. 1327 లో హాలెవీడు (ద్వారసముద్రము) రాజధానిగా గలప్రాచీనకర్ణాట సామ్రాజ్యముభగ్నమైపోయినది. అంతటితో నిరుస్సాహము జెంది పాతశేషు లగుమహారాష్ట్రాంధ్ర కర్ణాటవీరులూరకయుండ లేదు. నూతన స్వతంత్రసామ్రాజ్యములను స్థాపింపవలయు నని విశ్వప్రయత్నములను గావించి హిందూసంఘమతసంరక్షణమే ప్రధానాదర్శముగా బెట్టుకొని నూతనశత్రువు లగుమహమ్మదుమతస్థులు దక్షిణహిందూస్థానమున స్థావర మేర్పఱచుకొన కుండజేయవలె నని వీరాగ్రగణ్యులై ప్రవర్తించి తమజీవితముల ధారపోసిరి. అట్టి మహావీరులలోనివాడు సోమదేవుడు. వీనికాలమున మనము గుర్తించుటకు మూవురుమలకలు గొప్పవారు గాన్పించు చున్నారు. వారిలో నిరువుర సమాన పరాక్రమవంతులు. వారిరువురే దక్షిణహిందూదేశముపై పెక్కు దండయాత్రలు సాగించి దక్షిణదేశమునంతయు సంక్షోభము జెందించినవారు. 'అల్లాఉద్ధీన్‌ఖిల్జీ' అను డిల్లీచక్రవర్తి బానిసవాడయిన 'మలిక్‌కాపుర్‌' అనువాడు మొదటివాడు; డిల్లీ చక్రవర్తియై 'మహమ్మద్-బీన్-తుఘ్‌లఖ్‌' అనుబిరుదమును బొందిన 'మలిక్‌ఫకీరుద్దీన్‌జూనా' అనువాడు రెండవవాడు. ఈరెండవవాడు క్రీ. శ. 1325 వ సంవత్సరమున డిల్లిసిం