పుట:Aliya Rama Rayalu.pdf/28

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

హాసనము నధిష్ఠించుటకు బూర్వము 'అలూఫ్‌ఖాన్‌' అను నామాంతరము గూడ గలిగి యుండెను. 'మలిక్, ముల్‌క్,' శబ్దములను 'మల్కి, మలక, ముల్కి, ములక' యనుశబ్దములనుగా మార్చి తెలుగుకవులు తమతమప్రబంధములలోను, శాసనములలోను ప్రయోగించి వ్యవహరించుట గలదు. కనుక బాలభాగవతమున 'మహమ్మదుమలక' యని చెప్పబడినవాడు మహమ్మదుబీన్‌ తుఘ్‌లఖ్‌ అని బిరుదము బొందినమలిక్‌ ఫకీరుద్దీన్‌జూనా యనురెండవవా డనినాయభిప్రాయము. ఇతడు క్రీ. శ. 1334 సంవత్సరమున దనకు శత్రువగు 'బహఉద్దీను' నకు రక్షణ మొసంగినా డనుకారణముచే జంబుకేశ్వరరాయలపై దండెత్తివచ్చినా డనియు నాయుద్ధములో జంబుకేశ్వరుడు వీరమరణము నొందగా నీదుర్వార్త విని బహుళసైన్యముతో వచ్చి కళ్యాణపురాధీశ్వరుడయినసోమదేవరాజు మహమ్మదు బీన్‌తుఘ్‌లఖ్ సైన్యముల దలపడి కదనరంగమున వానినోడించి పరిభవించిపంపిన విషయమును రాఘవరాజును గూర్చి వ్రాయుసందర్భమున సూచించియున్నాను. ఈసంవత్సరమునాటికి బహమనీరాజ్యముగాని విజయనగరరాజ్యముగాని యేర్పడి యుండలేదు. ఈయుద్ధమునుగూర్చి మహమ్మదీయ చరిత్రకారులు వేఱువిధముగా వ్రాసినారు. ఈయుద్ధములో జక్రవర్తికే జయముగలిగె ననియు, ఆనెగొంది వానివశమయ్యెననియు, బహఉద్దీనునితో బాటు మఱియార్గురు మంత్రి వర్గములో జేరినవారిని చెఱపట్టె ననియు, వారిలో జంబు