పుట:Aliya Rama Rayalu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నదు. ఆకాలముననొక స్వతంత్రసామ్రాజ్యమును నిర్మాణముజేయసంకల్పించిన హరిహరబుక్కరాయాదుల వలె జాళుక్యసామ్రాజ్యమువంటి యొకస్వతంత్రసామ్రాజ్యమును నిర్మాణముజేయసంకల్పించి సార్వభౌమ బిరుదము వహించి కృషిచేసిన యొకస్వతంత్రప్రభు వనియె మనము నిశ్చయింపవలసియుండును గాని కర్ణాట సామ్రాజ్యాధీశ్వరు లగుహరిహరబుక్కరా యాదులకు లోబడి పరిపాలనముచేయుచు బహమనీసుల్తా నను మొదటిమహమ్మదుషాహతో బోరాడినవా డనియూహింపరాదు. ఇతనిబిరుదములలో "మాళవరాజేంద్రమస్తకశూల" యనియు 'హొసబిరుదురగండ' యనియు, రెండుబిరుదము లున్నట్టు బాలభాగవతమునందును, నరపతివిజయమునందును బేర్కొనబడి యున్నవి. ఈరెండుబిరుదములు నీతడు హరిహరబుక్కరాయాదులకు సామంతుడు గాడని విశ్వసించుటకు దోడ్పడుచున్నవి. ఎట్లన మాళవరాజేంద్రుడు డిల్లీసుల్తా నగు 'మహమ్మదు-బీన్-తుఘ్‌లఖు' నకు గప్పము గట్టుసామంతుడుగాని బహమనిసుల్తా నగుమహమ్మదుషాహకు సామంతుడు గాడు. ఈబిరుదములనుబట్టి యితడు క్రీ. శ. 1310-1347 సంవత్సరముల మధ్యకాలమున నున్నట్టు మనము నిశ్చయింపవలసి యుండును. ఈకాలమున డిల్లీచక్రవర్తు లగు మహమ్మదుమతస్తులు విజృంభించి మూడుహిందూస్వతంత్ర సామ్రాజ్యములను నాశనము గావించి దక్షిణహిందూస్థానము నంతటను గల్లోలము గావించిరి. క్రీ. శ. 1318లో