పుట:Aliya Rama Rayalu.pdf/247

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రికిని గ్రామముల నొసంగె ననిపైనియుదాహరించి యున్నాను. వీరాంధ్రకవులయిన నియోగి బ్రాహ్మణులు, వైష్ణవమతమవలంబించినవారు. తెలుగుద్విపదలలో వైష్ణవగ్రంథములు రచించినవారు వీరే. వీరిద్విపదలు రాగిరేకులమీద వ్రాయబడి యట్టివి వందలకొలదిరేకులు తిరుపతిదేవస్థానములో నున్నవని వినుచున్నారము. మహాపండితుడును మధ్వమతబోధకుడునగు విజయేంద్రస్వాములవారు రామరాయలచే ననేకాగ్రహారములను, కనకాభిషేకములను గాంచెను. అహోబలమఠాధిపతు లయినషష్టపరాంకుశు లనువారు సిద్ధాంతమణిదీపము, పంచకాలదీపిక, ప్రపత్తిప్రయోగ, నృసింహస్తవము మొదలగుగ్రంథములను రచించెను. ఇతడు కొంతకాలము రామరాయలకు కార్యకర్తగ నుండెను.

కాని యీతనియాస్థానకవులలో ముఖ్యుడయినవాడు భట్టుమూర్తి. రామరాజభూషణు డన్నబిరుదమును పొందినవాడు. ఇతడురచించిన వసుచరిత్రము, నరసభూపాలీయము, హరిశ్చంద్రనలోపాఖ్యానము మొదలగుగ్రంథములు రామరాయలమరణానంతరము రచింపబడినవిగా నున్నవిగాని యితనికాలమున రచింపబడినగ్రంథము లేవియు గానరావు. ఇతడు సుప్రఖ్యాతిగాంచిన యాంధ్రకవి యనియెల్లవారికిం దెలియును.


____________-