పుట:Aliya Rama Rayalu.pdf/246

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వర్తి సదాశివదేవరాయలుకూడ విష్ణుభక్తుడు. వీనిపూర్వులుకూడ వైష్ణవమత మవలంబించినవారే. వైష్ణవమతము నభివృద్ధిపఱచుటకై యితడు 1556 సంవత్సరమున 30 గ్రామములను రామానుజులవారి కనగా నాతనిచే నేర్పాటుకావింపబడినశాఖవారికి దానముచేసి యుండెను. సదాశివదేవరాయనికి మరణించుట యన 'వైష్ణవపదముచేరుటయే' యని యభిప్రాయ మున్నట్టుగా 1558 సంవత్సరము లోనియొకశాసనము వలన దెలియుచున్నది.

భాషాభిమానము - కవిపండితగోష్ఠి

ఇతడు సంస్కృతాంధ్రములయం దసమానపాండిత్యముకలిగి యుండుటయెగాక సంస్కృతాంధ్రకవులను పోషించినట్లు కనంబడుచున్నది. ఇతనిమంత్రి రామయామాత్యుడు సంగీతశాస్త్రజ్ఞు డనియు, సంస్కృతకవి, స్వరమేళకళానిధి యనుగ్రంథమును రచించి రామరాయల కంకితముచేసి యున్నవాడని యిదివఱకె తెలిపి యున్నాడును. రామరాయలకు సంగీతశాస్త్రజ్ఞానము కలదనియు, వీణపాట యందును సంగీతమునందు నెక్కువయభిరుచి గలవాడయి యుండెనని వీరవేంకటపతి రాయలవారు 1589 లో లిఖింపించినయొక శాసనము వలన దెలియుచున్నది. 1545 లో బాలుడైన సదాశివదేవరాయచక్రవర్తి మహాకవు లయిన తాళ్లపాక తిరుమలయ్యగారికిని వారికుమారు డయినచిన్నకోనేటి తిరువేంగళనాథయ్యగా