పుట:Aliya Rama Rayalu.pdf/248

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అనుబంధము

రామరాయల బిరుదుగద్యము

జయజయ, స్వస్తి, సమస్తసద్గుణస్తోమభద్ర, రణరంగ రామభద్ర, కళ్యాణమహీపాలభాస్వర, కళ్యాణపురవరాధీశ్వర, కన్యాకుమారీభీమరథీ తటాంతనిక్షేపవిజయస్తంభ, స్తోత్రార్హయశ: ప్రక్రియాపావనచరిత్ర, ఆత్రేయగోత్రక్షత్రియకుల పవిత్ర, మహితకేళికాపారాయణ, మహితచాళుక్య నారాయణ, ధానుష్కచక్రవర్తిబిరుద, నానావర్ణమండలీకరగండ, దైత్యేభరిగండ, హత్తిబ్బరగండ, భాసురభుజాదండ, జయబిరుదురగండ, అసమశూరదగండ, హొసబిరుదురగండ, గండరగండ, ఘనీకృతమదేభకరశరజన్యలంపట, త్రిభువనబిరుదుల వెన్నుసమ్మెట, పట్టెసరాయనిజానిష్ట, ఒడయరాయనిశాభట్టశిష్ట, వర్గరాయఘన ప్రియంకర, అష్టవిగ్రాయమనోభయంకర, విజయచరిత సింహాననాభాస్వర, విజయనగరసింహాసనాధీశ్వర, యుక్తివర్గసద్యోధనపుర, గుత్తిదుర్గనిర్భేదనపుర, వాదిపురతర్కాభరణ, ఆదవేనిదుర్గాపహరణ, ఘనచండవర్గబాధక, పెనుగొండదుర్గసాధక, మంద్రగిరిదుర్గభాస్వర, చంద్రగిరిదుర్గరాజ్యాధీశ్వర, శబ్దపరిశుద్ధపాలక, ఉద్దగిరిరాజ్యపాలక, కాయదుర్గపనయబంధుర, రాయదుర్గావనధురంధర, నందనశీలకిరీటపాదక, కందనవోలుకవాట