పుట:Aliya Rama Rayalu.pdf/231

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాడని ఫ్రెడరిక్కు తెలుపుచున్నాడు. [1] ఈవిషయమును "ఆంక్విటిల్ - డు - పెర్రాన్‌' అనునాతడుగూడ దెలుపుచున్నాడని హీరాసుఫాదిరి తెలుపుచున్నాడు. ఈయిర్వురిలో నొకడు రామరాయలు తనసోదరునిగా భావించికొనెడు 'ఎయిన్ - ఉల్ - ముల్కు' అనునతడయి యుండునని హీరాసు తలంచుచున్నాడు. ఇయ్యదినిజమై యుండవచ్చును. ఇతనిప్రేరేపణమూలముననే సదాశివదేవరాయలు బెవినిహల్లిగ్రామమును బ్రాహ్మణులకు దానముచేసి యుండెను. [2]

వీరుచేసిన ద్రోహమువలననే రామరాయల సైన్యములో బెద్దకలవరము పుట్టుటయు, రామరాయలకు గాయముతగులుటయు సంభవించెను. అతడు వెంటనె రణరంగమునుండి తొలగిపోవలయునని పల్లకినెక్కె నటగాని పల్లకిమ్రోయుబోయీలు హుస్సేనునిజాముషా సైన్యములోని యొకమదపుటేనుగ ఘీంకారము సేయుచు పై బడ భయపడి పల్లకి నచటవిడిచిపెట్టి పాఱిపోయిరట. అట్టినంకుల సమరమున నావృద్ధవీరుడు కాలినడకను వప్పించుకొనిపోదమని తలంచి పల్లకినుండి దిగుచుండగా నాయేనుగ రాయలను తొండముతో బట్టుకొని పై కెత్తెనని ఫెరిస్తావ్రాయుచుండగా 'ఆలీ -

  1. The AraviDu Dynasty of Vijianagar p. 211, 212.
  2. Ep. and XIV p. 231, V. 64, 68.