పుట:Aliya Rama Rayalu.pdf/230

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

గులయధికారి యగు రుమీఖాను రాగినాణెముల ఫిరంగులలో బోయించి హిందూసైన్యములు సమీపించినతోడనే ప్రేల్చుచునమిత నష్టమును గలిగించుచుండెను. ఇందువలన ఫిరంగుల సమీపమున నైదువేలహిందూసైనికుల శవములు పడియుండె నట. అప్పుడుహిందూసైనికులుచెదరి పరువిడుచుండ విజాపురసుల్తాను సేనాధిపతియగు 'కిశ్వర్‌ఖానులారీ' యను నాతడాఱువేల యాశ్వికులతో వచ్చి హిందువులపై బడి తఱుమనారంభించె నట. ఇట్టిసమయముననే హిందూసైన్యములో నొకగందరగోళము పుట్టినది. ఇంతవఱకు విజయనగరసామ్రాజ్యము క్రిందసేవకులుగ నున్నయిర్వురు తురకసేనానులు రాజద్రోహులై తమప్రభువయిన రామరాయలను విడిచి తమమతస్థులయిన సుల్తానులపక్షమునకు దమతమసైన్యములతో బోవుట సంభవించెను. ఈద్రోహవృత్తాంతమును ఫెరిస్తాగాని, ఆలీ - ఇబూ - అజీజుగాని తెలిపియుండలేదు గాని యుద్ధముజరిగిన యొకసంవత్సరమునకు విజయనగరవీథులలో దానుసంచరించునపు డచటివారు చెప్పగా దాను వినియుంటినని ఫ్రెడరిక్కను నొకపోర్చుగీసు లేఖకుడు వ్రాయుచున్నాడు. ఈతురకసేనాను లిరువురును చిక్కుసమయములో ద్రోహులై శత్రుపక్షములో జేరి యాకస్మికముగా దమప్రభువు నెదుర్కొని పోరాడుట మూలముననే రామరాయలపజయము గాంచెనుగాని లేకున్న నపజయము గాంచువాడు