పుట:Aliya Rama Rayalu.pdf/232

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇబు - అజీజ్‌' రామరాయలు గుఱ్ఱముమీదనుండగా బట్టువడె నని వ్రాయుచున్నాడు. ఎక్కడపట్టుబడిననేమి ? పట్టుబడినమాట వాస్తవము. అంత రాయలు చలబీరుమిలాను కడకు గొనిపోబడెను. అతడు వానినిచంపబోగా వానిసమీపమున నున్న హిందూదళవాయియగు 'దళపతిరాయి' యనుబ్రాహ్మణసేనాని యాయనను జంపకు మాతడేరామరాయలు; దివానుబరీదుకడకు గొనిపొమ్మని పలికెనట ! ఇయ్యది తెలిసికొని రుమీఖాను రామరాయలను హుస్సేనునిజాముషాకడకు గొనిపోయెనట. అతనితల వెంటనే కొట్టివేయు డనిహుస్సేనునిజాముషా యాజ్ఞాపించినట్లుగా మహమ్మదీయ చరిత్రకారులు వ్రాసియున్నారుగాని 'కోటో' యను పోర్చుగీసుచరిత్రకారుడు హుస్సేనునిజాముషా తానుస్వయముగా దనఖడ్గముతో నాతనితల ద్రుంచివైచెనని వ్రాయుచున్నాడు. ఈదుష్కార్యమును జేయునపుడు 'హుస్సేనునిజాముషా' 'ఇప్పడునీమీదనేను బగదీర్చుకొనుచున్నాను; నాకు దేవు డేమిచేయునోచేయ నిమ్ము' అనియుద్ఘోషించె నట. ఇట్లు శత్రువులదుర్మంత్రముల వలనను మాయోపాయముల వలనను 1565 సంవత్సరము జనవరి 25 తేదీని నీమహావ్యక్తి తన తొంబదియాఱవయేట రణరంగమున వీరస్వర్గమును గాంచెను. పాపము హుస్సేనునిజాముషా యిట్లక్రమముగా దనచేత జిక్కిన వృద్ధశత్రువును తలద్రుంచినందుకు మిక్కిలిపశ్చాత్తాపము జెందియుండును. ఇట్టిమహావిజయమును బొందిన