పుట:Aliya Rama Rayalu.pdf/215

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఇబ్రహీమ్‌కుతుబ్షా కిచ్చిపెండ్లిచేసినటుల కోటో వ్రాయుచున్నాడు. వారిలో వారికైకమత్యము బలపడుటకును, రామరాయల విజృంభణము నడంచుటకును నిట్టిసంబంధ బాంధవ్యములొన గూర్పబడినవి. ఇంక బీడరు, బీరారుసుల్తానులుగూడ వీరితో జేరిరి. గోల్కొండసుల్తానుపక్షమున ముస్తఫాఖాను, అహమ్మదునగర సుల్తానుపక్షమున మౌలానాఇనాయతుల్లాయును, రాయబారులుగా విజాపురమునకు బోయి యచట కిన్వరుఖాను మొదలగువారితో నాలోచించి వివాహసంబంధములను స్థిరపరచుటయెగాక ప్రమాణపూర్వకముగా సంధి పత్రములపై సంతకములు చేయబడినవట. అటుపిమ్మట యధావిధిగా వివాహములు జరుపబడి విజాపురమునను, అహమ్మదునగరమునను మహోత్సవములు జరుపబడినవట ! బీరారుసుల్తా నిందుచేరలేదని 'బసాతిన్ - ఉస్ - సలాతిన్‌' అను గ్రంథము తెలుపుచున్నది. బీదరుసుల్తా నిందుచేరలేదని ఫెరిస్తా వ్రాయుచున్నాడు. ఐదుగురుసుల్తానులు చేరినారని కోటో వ్రాయుచున్నాడు. అందరుసుల్తానులు నేకీభవించిరని మనము విశ్వసింపవచ్చును.

వీరిసమాచారము నంతయు జారులవలనవిని యెంత మాత్రమున జాగుసేయక సామ్రాజ్యములోని సామంత మడలాధిపతుల కందఱకును దెలియజేసి యుద్ధసన్నాహ ప్రయత్నములను జేయ మొదలుపెట్టెను. కృష్ణానది మొదలుకొని సింహళవరకు గలయావద్దేశమునుండియు సామంత