పుట:Aliya Rama Rayalu.pdf/216

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

మండలాధిపతులు, దుర్గాధిపతులు తమతమసైన్యములతో విజయనగరమున కరుదెంచిరి. మధురాపురమండలాధీశ్వరుడయిన విశ్వనాథనాయకునికుమారుడు కృష్ణప్పనాయకుడు తాను రాజ్యాభిషిక్తు డయినకాలము స్వల్పకాలమెయై యుండుట వలన దానుబోక తనసైన్యాధ్యక్షుడయిన అరియనాధ మొదలారిని నసంఖ్యాకసైన్యములతో బంపెనట ! సామ్రాజ్యసంరక్షణకై వీనితో 'బసవరా' జను మఱియొకముఖ్యనాయకుడు వెడలియుండె నట. అళియరామరాయ లిట్లుయుద్ధప్రయత్నములో యున్నకాలముననే విజాపురసుల్తానునుండి యొకరాయబారినిబంపి అదివరకు విజాపురసుల్తానునుండి వేఱ్వేఱుకాలములందు గైకొనిన యాతగిరి, బగ్రకోట, రాచూరు, ముదిగల్లు దుర్గములను విడిచిపెట్టవలసినదని యడిగించెనట ! ఇదియె విజాపురసుల్తాను విజయనగరముతో గలమైత్రిని విడిచిపెట్టినట్లుగ సూచించుచున్నదని ఫెరిస్తా వ్రాయుచున్నాడు. రామరాయలా రాయబారిని నవమానించి పంపివేసెననియు నిదియె కారణముగా జేసికొని యిస్లామునకు శత్రువయిన రామరాయలను సాధించుటకై వారలత్యంతవేగముతో సైన్యముల సమకూర్చుకొన బ్రోత్సహించెనని ఫెరిస్తా తెలుపుచున్నాడు.

ఎట్లయిననేమి? దక్కనుసుల్తానులు సమరోత్సాహసంభరితులై తమతమసైన్యములతో విజాపురప్రాంత దేశమునందలి బయళ్లలో గలిసికొనిరి. అచట విజాపురసుల్తానగు