పుట:Aliya Rama Rayalu.pdf/197

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

యాదవాభ్యుదయ మనుకావ్యమునకు వ్యాఖ్యరచించి యందు దనప్రభువు వంశమును బ్రశంసించి యీతడు తనవిజయములను సూచించుటకుగాను మలయాద్రి (తిన్నెవెళ్లి, ట్రావన్కూరు మండలములలోని పడమటికనమలు) సమీపమున జయస్తంభమును నెలకొల్పె నని వక్కాణించి యున్నాడు. [1] ఇక్కేరినాయకు డయిన సదాశివనాయకుడుగూడ చక్రవర్తియాజ్ఞను శిరసావహించి కేరళముపై దండెత్తిపోయి విజయమును గాంచి జయస్తంభమును నాటించె నని శివతత్త్వరత్నాకర మనుగ్రంథమున వర్ణింప బడియుండెను. [2]

ఈశివతత్త్వరత్నాకర మనుగ్రంథము మఱియొకగొప్ప సత్యమును వెల్లడించు చున్నది. కృష్ణదేవరాయల కాలమునుండి విజయనగర సామ్రాజ్యమునకు మిత్రులుగా నుండినపోర్చుగీసువారు సదాశివదేవరాయని పట్టాభిషేక కాలమునుండి విజాపురసుల్తానుతోడి మైత్రివలననో లేక స్వప్రయోజనముకొఱకో సామ్రాజ్యముతోడి సఖ్యతను విడనాడి శత్రువులుగ నేర్పడి దక్షిణదేశమునందలి సామంతనృపతులను గప్పము కట్టకుండ జేసి సామ్రాజ్యమును భగ్నపఱచుటకై పన్నాగములు పన్నుచు విశ్వప్రయత్నములు చేసియున్నట్టు మనమూహించుటకు దగినప్రమాణములు గలవు.

  1. Sources of Vijianagar, p. 210
  2. I bid, p. 195, 200.