పుట:Aliya Rama Rayalu.pdf/196

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

           బలిమిమై దిరువడి బట్టంబు గట్టె

           కృతకృత్యునకు చంద్రగిరి దుర్గముఖ్య
           వితతమహైశ్వర్యవిలసితాత్మునకు

           తిరువడిరాజ్య ప్రతిష్ఠాపకునకు
           విరచితపాండ్య భూవిభుశాసనునకు
           చేర చోళాదికక్షితినాధమకుట
           హారనీరాజనహృద్యపాదునకు."

తిరువడిరాజ్యము పంచతిరుపతు లనుపేరుతో నైదుభాగములుగా నుండె ననియు, వానినెల్లను జయించి కన్యాకుమారికడ జయస్తంభము పెట్టించె ననియు, తిరువడిరాజ్యమును జయించియు నారాజు శరణోగతు డగుటచేతమరల నారాజ్య మతనికి నొసంగి తిరువడిరాజ్య ప్రతిష్ఠాపకు డన్నబిరుదము గాంచినట్టు పైకవి వర్ణించి యున్నాడు. [1] [2]

ఈచినతిమ్మరాజుకడ గొంతకాల మాస్థానపండితుడుగా నుండినమహా మహోపాధ్యాయబిరుదాంచితులగు నప్పయ్యదీక్షితులవారు సయితము తనప్రభువుకోరిక ననుసరించి

  1. భారతిసంపుటము 6, సంచిక 6, పేజీలు 820, 821, 822, 823.
  2. Sources of Vijianagar p. 207, 208, 209.