పుట:Aliya Rama Rayalu.pdf/185

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

ఈపై విషయములను వ్రాయుచు హీరాసు మరలతలక్రిందుగ బోల్తా కొట్టు చున్నాడు.

స్వరమేళకళానిధిగ్రంథము రచింపబడినది 1559 గాక 1549 అయి యున్నది. ఈసంగతియందే తెలుపబడి యున్నది. [1]

        "శ్లో. శాకేనాత్రధరాధరాబ్ధిధరణీగణ్యే చసాధారణే
            వర్షేశ్రావణమాసిన్మిలతరేపక్షే దశమ్యాంతిథౌ
            రామామాత్యవినిర్మితస్వరదతోస్సడ్గతిరత్నాకరాత్
            స్సోయంమేళకళానిధిర్మతిమతామాకల్పమాకల్పితాన్."

            అనుశ్లోకము గ్రంథముచివరను జేర్పబడి యున్నది.

సదాశివదేవరాయలు పట్టాభిషిక్తు డయినవెనుక నేడెనిమిది సంవత్సరములలోపలనే స్వరమేళకళానిధి ప్రారంభింపబడి 1549 లో ముగింపబడియుండగా మఱిపదిసంవత్సరముల తరువాతనే రచింపబడినట్టు తలంచుచున్నాడు. వైజయంతమును మించినసౌధరాజ మనివర్ణింపబడిన రత్నకూటము 1549 సంవత్సరమునకుబూర్వమె రామయామాత్యునిచే నిర్మింప బడినది. అంతకుబూర్వమె రామయామాత్యుడు కొండవీటిరాజ్యమునకు బాలకుడుగా నియమింపబడి బ్రాహ్మణులకు నగ్రహారము లొసగుట కధికార మీయబడినవాడు గావున నందుకు దనకృతజ్ఞతను జూపుటకుగాను సంగీత శాస్త్రమునందు వివాదాస్పదములుగా నుండువానివిషయమైయొక

  1. Sources of vijianagar History p. 190