సంగీతశాస్త్రగ్రంథమును 'స్వరమేళకళానిధి' యనుపేరిట రచించి రామరాయల కంకితముచేయుటకు నిశ్చయించుకొంటినని యాగ్రంథమునందే వక్కాణించి యున్నాడు. ఇయ్యది రామరాయలు తనసామ్రాజ్యపరిపాలనమును ముగించి విశ్రాంతిగైకొన్నకాలముగా దనిస్పష్టముగా నాగ్రంథమె తెలుపుచున్నది. సత్యమిట్లుండగా సమస్తసామ్రాజ్య పరిపాలనాభారము నంతయు సోదరులభుజములపై నిడి రామరాయలు 1559 నుండి విశ్రాంతిగైకొని పండితగోష్టితో గాలము గడపెనని యొకమూల వ్రాయుచు మఱియొకమూల 1563 లో దురాశాప్రేరితుడై రాజ్యమాక్రమించి పట్టాభిషిక్తుడై తానేచక్రవర్తిగా బ్రవర్తించె ననుట యెంతహాస్యాస్పదమై యుండెనో చదువరులె గ్రహింపగలరు. ఇట్టిదురభి ప్రాయములను బ్రకటించుట నాటి హిందూసామ్రాజ్యసంరక్షణకొఱకు రామరాయాదు లవలంబించిన ప్రాచీన సంప్రదాయపద్ధతులమార్గ మెఱుంగని విదేశీయు డగుటయే ముఖ్యకారణముగా గ్రహింప దగియుండును. ఇవన్నియు హీరాసుస్వకపోల కల్పనలేగాని యిందెంతమాత్రమును సత్యముగానరాదు. రామరాయలు సదాశివదేవరాయని నెన్నడును జెఱసాలం ద్రోచి యుండలేదు. సామ్రాజ్యములోపలను వెలుపలను సామ్రాజ్య శత్రువులు బలిసియుండుటచేత చక్రవర్తిని గాపాడుకొనుట తనకు విధ్యుక్తధర్మ మనుకొనియె రామరాయలు తనప్రాణ మున్నంత వఱకు భద్రముగా గాపాడుకొనుచు వచ్చినాడు. ధర్మరాజు
పుట:Aliya Rama Rayalu.pdf/186
Jump to navigation
Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది
