పుట:Aliya Rama Rayalu.pdf/184

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

వినియోగించు చుండెనని రామయామాత్యుడు నుడువుచున్నాడు. రామరాయలు సంగీతమునందును వీణావాద్యమునందును నత్యంతాభిలాషకలవా డని 1589 నాటి రెండవవేంకటపతిరాయల శాసనము దెలుపుచున్న దట. మఱియు నీకాలముననేకాబోలు తనగురువును శ్రీనివాసార్యుని పుత్రుడునగు తాతాచార్యులతో చంద్రగిరిదుర్గమునకు బోయితనవిరామకాలమును శాస్త్రార్ధచర్చల నాలించుటయం దంకితముచేసి యుండు నట. విరామకాలమునందు గడపినయీ కడపటిసంవత్సరము లొక శతాబ్దముదాటినవెనుక 'మనుస్సి' వ్రాసిన తన 'Memoirs' అను గ్రంథమున నుదాహరించి యున్నవాడట !"

ఈవిభాగమైనవెనుక దొరతనమువిషయమైగాని మఱియేవిషయమైగాని యేమిజరుగుచున్నను జోక్యముకలిగించు కొనక సుఖతరమైనజీవితమును గడపె ననియాతడు వ్రాసియున్నాడట ! తల్లికోటయుద్ధమునకు బూర్వపు దినములలో సర్వాధికారముగల మంత్రిత్వ పదవియు, రాజ్యాంగమును తిరుమలరాయల హస్తగతము గావింపబడె నట. ఇత డిట్టిపదవికివచ్చుటచేత కొండవీటిరాజ్య ప్రతినిధిప్రభుత్వపదవి రామయామాత్యునికి బహుశ: సమర్పింపబడియుండు నట. ఈనూతన ప్రభుత్వపరిణామము నందువేంకటాద్రి సకలసామ్రాజ్య సైన్యాధిపత్య మందుంచబడె నట.