పుట:Aliya Rama Rayalu.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రెండుశాసనములు గలవనియు వానిలో నొకటి 1543లో పెనుగొండనగరమున "రత్నసింహాసనా రూడుడై రాజాధిరాజ రాజపరమేశ్వరవీరప్రతాప మహారాయరామదేవ అయ్యంగారు పరిపాలనము చేయుచుండగా" అని వ్రాయబడియున్న దనితెల్పుచు నియ్యదికల్పితశాసన మనియు గల్పితశాసన మయ్యును రామరాయలను విజయనగరచక్రవర్తియని తెలుపుచున్నదనియు, మఱియొకటి 1565 సంవత్సరములోనిది సదాశివరాయలపేరెత్తక విద్యానగరసింహాసనాధిపతులయిన కుంతలాధిపతి రాజాధిరాజ రాజపరమేశ్వర వీరప్రతాపవీరరామదేవరాయ మహారాయలు రత్నసింహాసనారూడులై శాంతియుతులై విశ్వమును బరిపాలించుచుండె నని వ్రాయబడియుండె నట. ఈశాసనములతో బాటు అనంతాచార్యకవి తనప్రపన్నామృత మనుగ్రంథమున కృష్ణరాయలతరువాత పరిపాలనము చేసినరామరాయలను విజయనగరచక్రవర్తి యని వ్యవహరించినా డట ! ఇన్నిప్రమాణములు చూపినప్పుడు హీరాసు గారియభిప్రాయము నిరాకరించు టెట్లని చదువరులకు సంశయము కలుగవచ్చును. కాని వీనిని జాగరూకతతో బరిశీలించినయెడల దుర్ర్భమలపాలుకా జాలము. అనంతాచార్య కవి తనప్రపన్నామృతమున రామరాయలను విజయనగర సార్వభౌమునిగా వర్ణించియుండలేదు. అతడు కృష్ణరాయల యనంతరము గురుభక్తిపరాయణు డైనరామదేవరాయా