పుట:Aliya Rama Rayalu.pdf/180

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


ఖ్యుడు ధర్మముతో రాజ్యపరిపాలనము చేసె ననిమాత్ర మీక్రిందిశ్లోకమున జెప్పి యున్నాడు.

       "శ్లో. శ్రీరామదేవరాయాఖ్య: కృష్ణరాయాదనంతరమ్
           శశాసరాజ్యంధర్మేణగురుభక్తిపరాయణ:"

ఈక్రిందనే ఒకప్పుడు రామరాయలు తనగురువయిన తాతార్యుని వెంటదీసికొని చంద్రగిరికి వెళ్లె ననిమఱియొక శ్లోకమున నిట్లుచెప్పియున్నాడు.

       "శ్లో. సభూపతిర్మహాతేజా: యయౌచంద్రగిరింప్రతి
           గురుంతాతార్యమాదాయ రామరాయాభిధస్తదా"

ఇంకొకశ్లోకములో రామరాయలసహాయముచేత మహాయశుడయిన దొడ్డయాచార్యుడు శైవశాస్త్రవిదులను జయించెనని యిట్లుచెప్పియున్నాడు.

       "శ్లో. రామరాయసహాయేనమహా చార్యోమహా
           యశా: దుర్జయానపినిర్జిత్యశైవాన్‌శాస్త్రవిదుత్తమ:"

హీరాసుఫాదిరి వీనిని విజయనగరచరిత్రమునకు మూలప్రమాణము లనియర్ధమిచ్చు "సోర్సెస్‌ ఆఫ్ విజయనగర్‌ హిస్టరీ" అను గ్రంథమునుండి యెత్తికొని చూచి వ్రాసి యున్నారు. అందువీని నింగ్లీషునకు తర్జుమాచేసినవారు రామరాయలను విజయనగరచక్రవర్తిగా బేర్కొనియుండుటచేత నిత డట్లు వ్రాసియుండెనే కానిమూలమున నట్లుగానరాదు. [1]

  1. Sources of Vijianagar History, p. 202.