పుట:Aliya Rama Rayalu.pdf/178

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వీరివిమర్శజ్ఞాన మల్పమయిన దనిచూపుట కీయొక్క విషయమే చాలును. ఇట్టివి వీరిగ్రంథము నందుబెక్కులు గలవు. హీరాసువ్రాతలప్రకారము రామరాయ లెప్పుడు పట్టాభిషిక్తు డయ్యెనో సత్యము తెలిసికొన బ్రయత్నింతము. 1563 సంవత్సరాంతము వఱకు బదుమూడు సంవత్సరములు పరిపాలనము జరిపిన వెనుక రామరాయలపాలనము తృప్తికరమగునట్లుగా దృడపడినందున సదాశివదేవరాయలు మృతినొంది నట్లు వదంతులు వ్యాపింపజేయబడిన వట. పిమ్మట దురాశాయుక్తుడగు నీతడుతనంతటతానే రాజపట్టము గైకొనియె నట ! ఆంక్విటిల్, సీజరుఫ్రెడరిక్క వ్రాసినదానినిబట్టి రామరాయలు విజయనగరములో బట్టాభిషిక్తుడయినట్లే తమకు గన్పట్టుచున్న దట. ఒకశతాబ్దమునకు దరువాత ననగా 1688 లో 'మనుప్సి' అనునతడు రామరాయలను నరసింగరాజ్య (విజయనగర రాజ్య) చక్రవర్తి యని వ్రాసినా డట ! 1565 లో ముద్రింపబడినయొక పూలవరహాపై రామరాయలపే రొకప్రక్కన గన్పట్టుచున్న దట. 1562 - 63 సంవత్సరమునాటి దేవదుర్గ తామ్రశాసనములో రామరాయలు సర్వాధిపత్యము వహించి విజయనగరములో బరిపాలించుచుండె నని వ్రాయబడిన దట. ఆసంవత్సరములోనే యొకసామాన్యగృహస్థుని శాసనములో సదాశివరాయలపే రెత్తకుండ రామరాయలు సామ్రాజ్యమును బరిపాలించుచుండెనని వ్రాయబడిన దట. రామరాయలు చక్రవర్తిబిరుదములు వహించినట్లుగా సూచించునవి