పుట:Aliya Rama Rayalu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

శత్రుసైన్యము లాదవానిదుర్గమున దాగొన్నారా ? పాపమీయనామధేయచరిత్రకారు డాదవానిదుర్గ మెంతసైన్యమును దనలో నిముడ్చుకొనశక్తిగలిగియున్నదో తెలిపియున్నయెడల నెంతో చక్కగా సత్యము బైటబడియుండునుగదా ! ఈయనామధేయ చరిత్రకారు డిట్టియబద్ధమును గల్పించి వ్రాసినందుకు మాకు వింతలేదుగాని హీరాసుఫాదిరి యీయబద్ధములను సత్యములని నొక్కి వక్కాణించుట వింతగొల్పుచున్నది.

1551 సంవత్సరమున విజాపురసుల్తానునకును, అహమ్మదునగరసుల్తానునకును జరిగినయుద్ధములో అహమ్మదునగరమునకు దోడ్పడుటకయిరామరాయలు దండయాత్రకు బోయియుండె ననియు, అట్లుపోయి విజాపురసుల్తాను వగురాచూరు, ముదిగల్లుదుర్గములను జయించి అహమ్మదునగర సుల్తానుతో జరిగినయొడంబడిక ప్రకారము వానిని స్వాధీనపఱచుకొని కొంతసైన్యముతో దనతమ్ముడయిన వేంకటాద్రి నచట నిలిపి తాను విజయనగరమునకు మరలివచ్చి ననియు, తరువాత వేంకటాద్రి సాహాయ్యముతో నహమ్మదునగరసుల్తాను షోలాపురమును ముట్టడించి కొలదికాలములోనే స్వాధీనము చేసికొనియె ననిఫెరిస్తా మొదలగువారి గ్రంథములనుండియె హీరాసుఫాదిరి యెత్తి వ్రాసి యుండియు బైయనామధేయచరిత్రకారుని వ్రాతలోసత్య ముండె ననియెట్లు విశ్వసింపగలిగెనో యదియే వింతగా నున్నది. [1]

  1. The Aravidu Dynasty of vijianagar p. 84.