పుట:Aliya Rama Rayalu.pdf/168

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నట ! 1568 సంవత్సరములో తిన్నెవెళ్లిమండలమున మరియొక్కటియు, 1569 లో కోయంబత్తూరుమండలమున నొకటియు, 1570 లో మధురమండలములో నొకటియు, నెల్లూరు మండలములో నొకటియు, సదాశివదేవరాయలు చక్రవర్తిగా నున్నట్టుగ నాతనిపేరిటశాసనములు గన్పట్టుచున్న వటగాని దురదృష్టవంతు డయినయాచక్రవర్తి యంతకుబూర్వమే మరణము జెందియుండెననియు, అప్పటి కాతనిమరణవార్త యాదూరప్రదేశములకు జేరియుండలే దనిహీరాసు వ్రాయుచున్నాడు. ఇరువదిఎనిమిది సంవత్సరములపరిపాలనానంతరము సదాశివరాయలెట్టిమరణము జెందె ననిప్రశ్నింపుచు తనకుదానె యిట్లు ప్రత్యుత్తరము నిచ్చుచున్నాడు. మనకాలముననున్న సూయల్‌దొరగారు సదాశివరాయలను సంహరించి తిరుమలదేవరాయల సామ్రాజ్యమాక్రమించి పరిపాలించినాడనివ్రాసినా డట ! వెంకయ్యకృష్ణశాస్త్రిగా ర్లంగీకరించినారట! కాని తిరుమలదేవరాయలకాలమున నున్నఫ్రెడరిక్కను పోర్చుగీసుబాటసారి సదాశివరాయలను సంహరించినవాడు తిరుమలదేవరాయనికొడు కనివ్రాసినా డట! ఈరాజహత్య గావించినవాడు తిరుమలరాయలే యనిచెప్పుటకు సమకాలీనమగు ప్రత్యక్షప్రమాణ మేదియేలేకపోయినను, ఈహత్య కాతనినొకప్రోత్సాహకునిగా నేవిధ మయినసందేహములేకుండ నిశ్చయముగా జెప్పవచ్చు నట! ఎందుకన: ఆంక్విటిల్ - డు - ఫ్రెర్రాన్ అనునాతడు తిరుమలరాయనికొడుకు సదాశివరాయని