పుట:Aliya Rama Rayalu.pdf/167

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

రాజని (తిరుమలదేవరాయలు) కూడ వ్రాసియున్నవాడు. ఈయభిప్రాయముకూడ సత్యముగా గనుపట్టదు. ఎందుకన 1568 సంవత్సరములో సదాశివరాయలు తనసామ్రాజ్యములోని దక్షిణభాగమున సంచారముచేసి యనేకసామంత నృపతులవలన కట్నములను కానుకలను బొందినవాడు. వారిలో ముఖ్యుడు మధురమండాలాధీశ్వరు డయినకృష్ణప్పనాయకుడు. పవిత్రమైన కావేరీతీరమున శ్రీరంగనాథస్వామివారి సన్నిధిని అనేకసామంతనృపతులతోడను, విద్వజ్జన పరివారజనంబులతోడను, మంత్రులతోడను, గురుజనంబులతోడను సదాశివదేవరాయలు గొలువుదీర్చియుండ గృష్ణప్పనాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామివారి కైంకర్యములకొఱకు కృష్ణాపురమును వానిసమీపమున నుండుమఱితొమ్మిది గ్రామములతోగూడ సమర్పింపవలసినదిగా బ్రార్థింప నతడంగీకరించి యట్లుగావించె నని కృష్ణాపురశాసనమువలన స్పష్టముగా దెలియుచున్నది. [1] దీనిని గుర్తించియు దనగ్రంథమున నుదాహరించియు, హీరాసుఫాదిరి యిందునకొకవిపరీతమైన వ్యాఖ్యానము చేయుచున్నాడు. విజయనగరసామ్రాజ్యనిర్వహణ ప్రచారమునకై యనేకసంవత్సరములక్రిందట ఖైదుగావింపబడినచక్రవర్తి విగ్రహమునుసామ్రాజ్యప్రజలకు జూపింపవలసివచ్చినదట ! ఇయ్యది తిరుమలదేవరాయల రాజనీతినైపుణ్యతను మాత్రమే దెలుపు

  1. Ep. Ind., IX, p. 340 - 341. V. V. 44 - 45, 70, 96 and 102 - 4.