పుట:Aliya Rama Rayalu.pdf/169

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వానికుమారుని జెరలో నుంచి సదాశివరాయని కుమారుని జంపినా డనివ్రాసినా డట ! చంపబడినవాడు కుమారుడో తండ్రియో తెలియరా దట! హీరాసునకు మరియొక చిక్కు గన్పట్టినది. తిరుమల దేవరాయలకు నల్వురుకొమాళ్లు గలరు. ఏకుమారునిపై నేరమారోపించవలయునో బాగుగా నాలోచింపవలసివచ్చినది. తిరుమలదేవరాయని కుమారులలో నెవనిపై యీరాజహత్య మోపవలసియుండునో సరిగా నిర్ణయించి చెప్పుట సులభసాధ్యము కాదట! వానినల్వురుకొమాళ్లలోను బెద్దవాడయిన రఘునాథరాయలపేరు రక్షస్త్స గిడి (తల్లికోటసమీపమున రక్షస్సు - తగిడియను రెండుగ్రామములు గలవు) యుద్ధానంతరము వినంబడ కున్నందునను, ఆయుద్ధమున నాతడు గాయపడినందునను తిరుమలదేవరాయలకు బూర్వమె యాతడు మృతినొంది యుండు నని యూహింపవచ్చునట. రంగరాయలు రామరాయలు, వేంకటపతిరాయలు మూవురు మాత్రముబ్రదికియుండి రట! సదాశివదేవరాయలను ఖైదుగానుంచిన చెరసాల చంద్రగిరిదుర్గమే యైనయెడల నాచెఱసాలకు వేంకటపతిరాయలే జైలరుగా (కారాగృహాధికారి) నుండుటచేత భావికాలమున నారవీటివంశీయుడై మహాప్రఖ్యాతితో బరిపాలనముచేసిన రెండవవేంకటపతి దేవరాయలనే కడపటరాజ్యముచేసిన తుళువకుల ప్రతినిధి యగుసదాశివదేవరాయల మరణమునకు నుత్తరవాదిగా జేయవచ్చునట! ఎందుకన, నూరేండ్లతరువాత నున్నఆంక్విటిల్ - డు - ఫెర్రాన్ రెండవ