పుట:Aliya Rama Rayalu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గురుసేనానులయాధిపత్యముక్రింద నునిచి పంప బడియెను. ఇట్లీసైన్యములు వెడలిపోయి పెండాదుర్గమును ముట్టడించిరి. ఆదుర్గములోనివారు పెక్కుదినములవఱకు దానిని గాపాడుకొనలేక కొన్నిదినములుగడిచినవెనుక దుర్గమును వశపఱతు మని వర్తమానము పంపిరి. ఈవర్తమానమును వారలుగవర్నరునకు దెలియజేయగా నాతడు క్రొత్తసుల్తానునువెంటబెట్టుకొని వచ్చెను. అబ్దుల్లాయాదుర్గమును స్వాధీనపఱచుకొని తక్కిన రాజ్యము నాక్రమించుకొనుటకై దండయాత్ర సాగించెను. పోర్చుగీసుగవర్నరు పెండాదుర్గమున 600 సైనికుల 'నొరోన్‌హా' యాధిపత్యమున నిలిపి తాను గోవానగరమునకు మరలివచ్చెనుగాని స్వల్పకాలములోనే మరణించెను. 1555 సంవత్సరమున 'డొమ్‌ఫ్రాన్సిస్కోబర్రెటో' గవర్నరుగా బూర్వపుప్రభువువలెనె అబ్దుల్లాకు దోడ్పడు చుండెను.

ఈసమాచార మంతయు దెలిసికొని పోర్చుగల్ దేశపు రాజు చాలసంతోషించి యాసంతోషమును గోవానగరములోని తనప్రతినిధికి 1557 వ మార్చి 20 తేదిగలజాబుమూలమున దెలియజేసె నట. ఇట్లుండ అబ్దుల్లా పోర్చుగీసువారి సహాయముతో విజాపురముపై దండెత్తి వచ్చుచుండెను. విజాపురములోని సామంతప్రభువు లీసమాచారము దెలిసికొని క్రొత్తసుల్తానుపక్షముననుందు మనివెల్లడింప సాగిరి. ఇంతకుముందే విజాపురసుల్తాను మృతిజెందుటయు ఆలీఆదిల్‌షా రాజ్యమునకువచ్చుటయు నీతడుబాలు డగుటయు వారిసాహ