పుట:Aliya Rama Rayalu.pdf/158

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సమును రెట్టింప జేసెను. ఆలీఆదిల్‌షా రామరాయలును శరణువేడుచు రాయబారులను బంపెను. రామరాయలు పదునైదువేలసైన్యములను బంపగా నాసైన్యములతో ఆలీఆదిల్‌షా అబ్దుల్లాను పూర్తిగా నోడింప నాతడు అహమ్మదునగరమునకు బాఱిపోయెనుగాని నిజాముషా నూతనముగా రామరాయలతోను, ఆదిల్‌షాతోను ఇంతకు బూర్వముననే సంధి గావించుకొనియుండుట చేత అబ్దుల్లాను బ్రూలాకొండలలో జెఱబెట్టి యుంచెను. బురహాన్‌నిజాముషామరణానంతరము గోల్కొండసుల్తాను కోరికమీద హుస్సేనునిజాముషా యాతనిచెఱనుండి విడిచిపుచ్చెను. అతడు గోవానగరమునకు వెడలిపోయి యచట మరణించెను. 1611 లో నతనిమనుమడు క్రైస్తవమతమును స్వీకరించెనట! ఈవిధముగా అబ్దుల్లాచరిత్రము కడముట్టినది.[1]

విజయనగర గోల్కొండ యుద్ధము

ఇబ్రహీముకుతుబ్షా నాడువేంకటాద్రిజగదేవరావుతో గోల్కొండరాజ్యముపై దండయాత్రసాగించుచున్నవా డని విన్నమాత్రమున భయకంపితగాత్రుడై కళ్యాణిదుర్గమును ముట్టడించుట మానుకొని వేగమున స్వరాజధానికిబఱుగిడివచ్చి తనసేనానులలో సుప్రసిద్ధుడుగా నున్న ముజాహీదుఖానుని వారల నెదుర్కొన బంపెను. ఇత డింతగాభయపడుట కొక

  1. The Aravidu Dynasty of vizianagar page. 93, 94