పుట:Aliya Rama Rayalu.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అబ్దుల్లాను విజాపురసుల్తానుగా బట్టాభిషిక్తుని గావించి పెండాదుర్గమును స్వాధీనపఱచు కొనవలసిన దనిగవర్నరును కోరెను. ఎట్లయిన తనపొరుగువా డయినవిజాపురసుల్తానుని నాశనము జేయవలయు ననినిజాముషా తలపోయు చుండెను. ఈపద్ధతిగోవాగర్నరు తలకెక్కినవెంటనే యాతడు తనమందిరమున కెదుటనున్న యొకచదరమున బంగారుపూతవేయబడిన యొకపట్టువస్త్రమును బరిపించి మహోన్నత మైనయొక రంగమును నిర్మాణముచేసి గోవాపౌరులను, పోర్చుగీసువారిని, ఇంకను అబ్దుల్లామిత్రు లయినవిజాపుర సామంతులను నాహ్వానించి వారలసమక్షమున రాజకుమారు డయిన అబ్దుల్లా ఆదిల్‌షా విజాపురసుల్తా ననివక్కాణింపుచు తానేకిరీటమును వానిశిరస్సున నిడెను. ఇందునకు క్రొత్తసుల్తాను తనకృతజ్ఞతను దెలుపుచు 'సాల్ సెట్టి, బర్డెజ్‌' పరగణాలపై దనకుగలహక్కు నంతయు వదలుకొంటినని ఉచ్ఛైస్వరమునఘోషించెను. ఈయ పూర్వమహోత్సవము ముగిసినవెనుక గవర్నరుగారు 3000 పదాతిసైన్యమును 200 గుఱ్ఱపుదళముతోడ్పాటుతో విజాపురసుల్తాను స్వాధీనముననున్న పెండాదుర్గమును వశపఱచుకొనవలసినదిగాబంపెను. ఆశ్వికసైన్యము గోవాకెప్ట నగుగస్పారు 'డిమెల్లొ' గారియాధిపత్యమున మొదట పంపబడెను. అటుపిమ్మటపదాతిసైన్యము "ఫెర్నాండోమార్టిన్సుఫ్రీరి, మార్టిమ్‌అఫాంసోడిమిరాండా, డోమ్‌ఫెర్నాండొమాన్‌రాయ్, డోమ్‌అంటానియోడినొరోన్‌హా, సెబాస్టియోడిసా," అనునైదు